మీకు చేతకాక, రెచ్చగొట్టొద్దు: కేసీఆర్‌ను ఏకేసిన దేవినేని

ఉభయ రాష్ట్రాల్లో ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు, తేడాలు లేవన్నారు. కేసీఆరే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశం గౌరవించదగ్గ వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని, అలాంటి వ్యక్తి పేరును మార్చడం సరికాదన్నారు. ఎన్జీరంగా పేరును మార్చడం సరికాదన్నారు. ఇలాంటి పనులతో కేసీఆర్ రెచ్చగొడుతున్నారన్నారు. పునర్విభజన చట్టం పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు.
ఆచార్య ఎన్జీరంగా గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం ఏం చేశారో తెలియకపోతే మేధావులను అడిగి తెలుసుకోవాలన్నారు. తామేమీ కేసీఆర్‌ను అభ్యర్థించడం లేదని, విభజన చట్టంలోని హక్కులను న్యాయబద్ధంగా అడుగుతున్నామన్నారు.
వీపీటీఎస్ చీఫ్ ఇంజనీర్‌గా వరంగల్‌కి చెందిన సమ్మయ్య ఉన్నారని, ఆయనను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఆర్డీఎస్‌కు ఆర్మీని పెట్టి పూర్తి చేయాలా? విభేదాలు, విద్వేషాలు రేపి పబ్బంగడుపుకుందామని చూడడం సరికాదని హితవు పలికారు. సింగరేణి బొగ్గు కేటాయింపుల్లో వివక్ష వల్లే తెలంగాణకు విద్యుత్ సమస్య ఏర్పడిందని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications