వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనలేదంటూ అసలు అజెండా: కేసీఆర్-బాబు దోస్తీ వెనుక మోడీ! జగన్‌కు రివర్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు రావాలని బలంగా ఆశిస్తున్నామని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ పలువురితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోను చర్చించారా అని అడిగితే ఇంకా లేదని చెప్పారు.

చదవండి: మోడీ దెబ్బతో గుబులు.. నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: బీజేపీకి చెక్ చెప్పేందుకు 'లోకల్' ప్లాన్

శనివారం రాత్రి గంటకు పైగా మాట్లాడిన కేసీఆర్ ప్రధాని మోడీపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని అంటున్నారు. మోడీపై వివరణ ఇచ్చుకున్నప్పటికీ అసలు కేసీఆర్ చెప్పాలనుకున్నది థర్డ్ ఫ్రంట్ గురించే అంటున్నారు.

చదవండి: జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?

చంద్రబాబుతో సై

చంద్రబాబుతో సై

బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుంటా దేశ రాజకీయాల్లో మరో ఫ్రంట్ అవసరమని దానిని హైలెట్ చేశారని అంటున్నారు. ఇందుకోసం కొందరితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆయన మాటలను బట్టి మోడీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సహా ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇంకా చెప్పాలంటే ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయని భావిస్తున్నారు.

జగన్-కేసీఆర్ దోస్తీ అంటూ

జగన్-కేసీఆర్ దోస్తీ అంటూ

ప్రారంభంలో వైసీపీ, టీఆర్ఎస్ దోస్తీ కట్టాయనే విమర్శలు టీడీపీ నుంచి వచ్చాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరినప్పటికీ జగన్ మాట్లాడకపోవడంతోనే కేసీఆర్-వైసీపీ దోస్తీ అర్థమైందనే వాదనలు వినిపించాయి. ఓటుకు నోటు కేసు సమయంలోను జగన్, కేసీఆర్‌లు కలిసి చంద్రబాబును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది.

తెలుగు రాష్ట్రాల్లో లెక్క మార్చిన మోడీ

తెలుగు రాష్ట్రాల్లో లెక్క మార్చిన మోడీ

ఆ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. టిడిపి, టీఆర్ఎస్ దోస్తీ మొదలు విలీనం.. పొత్తు వరకు చర్చ సాగుతోంది. 2019లో టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా ఒక్కటయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఓ విధంగా మోడీ గెలుపు మోడీ-కేసీఆర్‌ల బందాన్ని మరింత పెంచుతోందని అంటున్నారు. ప్రత్యేక హోదా, అవిశ్వాస తీర్మానాల విషయంలోను బాబుకు అనుకూలంగా మాట్లాడారు. కేంద్రం హోదా ఇవ్వాలని, వైసీపీ పెట్టే అవిశ్వాసం చీఫ్ పాలిటిక్స్ అని కేసీఆర్.. జగన్‌ను ఎద్దేవా చేశారు.

కీలక వ్యాఖ్యలు

కీలక వ్యాఖ్యలు

భారత రాజకీయాల్లో మార్పు అవసరమని, కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నామని, థర్డ్ ఫ్రంటో.. మరో ఫ్రంటో.. కేంద్రంలో గుణాత్మక మార్పు రావాలని, కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని, దేశ రాజకీయాల్లో మార్పుకు నాయకత్వం వహించాల్సి వస్తే కచ్చితంగా వహిస్తానని, తెలంగాణ వాడి సత్తా చూపిస్తానని, పథకాల పేర్లు మార్చడం మినహా కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని, త్వరలో రాజకీయ వేదికకు తుది రూపు వస్తుందని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, హోదా ఇస్తానంటే ఇస్తానని, లేదంటే లేదని మోడీ చెప్పాలని, హోదా కోసం ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, రిజర్వేషన్లు వంటి అంశాలపై దేశమంతా ఒక నీతి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నీతి సరికాదన్నారు.

అసలు అజెండా బయటపెట్టిన కేసీఆర్

అసలు అజెండా బయటపెట్టిన కేసీఆర్

తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లు తాను మోడీపై అనుచితంగా మాట్లాడలేదని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని చెబుతూనే కేసీఆర్ తన అసలు అజెండా థర్డ్ ప్రంట్ అంశం బయటపెట్టారని అంటున్నారు. కేసీఆర్ దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. హోదా విషయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయని, కానీ అంతిమంగా ఏపీ ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు.

English summary
Telangana Chief Minister K Chandrashekar Rao expressed concern over the ruling TDP, BJP and other parties in Andhra Pradesh politicising the issue of ‘Special Status’ and making people the final victims on the sensitive issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X