సిరీస్: ఎపి నుండి టిఎస్‌కు మారిన కెసిఆర్ కాన్వాయ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్లకు టిఎస్ సిరీస్‌తో శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రాష్ట్రంలో కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లన్నీ సోమవారం నుండి టిఎస్‌తో చేపట్టనున్నారు. ఈ సిరీస్‌కు కేంద్రం ఆమోదం కోసం వేచి ఉన్నందున పన్నెండు రోజులు వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేశారు.
అధికారిక నోటిఫికేషన్ వెలువడటంతో టిఎస్‌తో రిజిస్ట్రేషన్‌కు అధికారులు ఏర్ప్టాలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం వినియోగిస్తున్న అధికారిక ఫార్చ్యూనర్ వాహనాలకు ఇప్పటి వరకు ఎపి సిరీస్‌తో నెంబర్లు ఉన్నాయి.

ఆ నెంబర్లను యథావిధిగా ఉంచి సిరీస్‌ను మాత్రం ఎపి నుంచి టిఎస్‌గా మార్చారు. సిఎం కోసం 6 ఎన్డీవర్ వాహనాలను ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటికి రిజిస్ట్రేషన్లు చేయించాల్సి ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాన్వాయ్‌లోని వాహనాల నెంబర్లు అలాగే ఉంచి సిరీస్‌ను మాత్రం ఎపి నుండి టిఎస్‌గా మారింది.

తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి టిఎస్ కోడ్‌ను కేంద్రం కేటాయించింది. పది జిల్లాలకు 16 కోడ్ నెంబర్లను ఖరారు చేశారు. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎనిమిది నెంబర్లు కేటాయించారు. అదిలాబాద్ జిల్లాకు 01 కోడ్ కేటాయించారు. ఇక రవాణా నిబంధనలు ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనలు, చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.













Click it and Unblock the Notifications