సోనియా కాళ్లవద్ద పెడతానన్నారు: కెసిఆర్‌పై దానం ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే... తెలంగాణ రాష్ట్ర సమితిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా కాళ్ల వద్ద పెడతానని, ఏఐసిసిలో పని చేస్తానని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో పలుమార్లు చెప్పారని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు దానం నాగేందర్ ఆదివారం అన్నారు.
ఏ పార్టీతో పొత్తు లేకుండా తాము 2009లో సత్తా చూపామని, వచ్చే ఎన్నికలలోను అదే జరుగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెసు పార్టీకే దక్కుతుందన్నారు. మతతత్వ పార్టీలకు అదికారమిస్తే హైదరాబాదు నగరంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకమేనని చెప్పారు.

సమైక్యవాదినే: పనబాక
తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ప్రకాశం జిల్లాలో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను ప్రయత్నించానని అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయానని తెలిపారు. తనపై విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నానని అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించలేదన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు.
హర్ష కుమార్‌కు సెగ
తూర్పు గోదావరి జిల్లాలో హర్షకుమార్‌కు సెగ తగిలింది. పూర్తికాని పాశర్లపూడి బ్రిడ్జిని 4న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణతో ప్రారంభింప చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలతో కుమ్మక్కయ్యారని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications