వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోతులు వెనక్కి పోవాలి: కెసిఆర్, సిఎంను ఆకాశానికెత్తిన మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోతుల బెడద నుంచి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆయన కోతుల బెడద గురించి ప్రస్తావించారు. కోతులు తమ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కోతుల బెడద నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా చెట్లను బాగా పెంచాలన్నారు.

కోతులు ఉండే జాగాలను మనం పాడు చేశామని, అవి ఇంకా పంట పొలాలకు వస్తున్నాయని ఆయన అన్నారు. కోతులు ఉండే ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచితే అవి పొలాల వద్దకు రావని సూచించారు. ఇక నుంచి హరితహారంలో భాగంగా చెట్లను బాగా పెంచాలన్నారు. కోతులు వాపస్ పోవాలని, తెలంగాణకు వానలు రావాలని కెసిఆర్ అన్నారు. అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు.

కాగా, కెసిఆర్‌ను మంత్రులు, టిఆర్ఎస్‌ నాయకులు ఆకాశానికెత్తుతూ ప్రశంసల జల్లు కురిపించారు. మంత్రులు వివిధ తీర్మానాలను ప్రతిపాదించారు.

అది కెసిఆర్ ఘనతేనన్న ఈటెల

గమ్యాన్ని ముద్దాడే వరకు అనేక కష్టనష్టాల కోర్చి తెలంగాణ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. వర్తమాన రాజకీయాలు - టీఆర్‌ఎస్‌పై తొమ్మిదో తీర్మానాన్ని టీఆర్‌ఎస్ ప్లీనరీలో మంత్రి ప్రవేశపెట్టారు. ఆంధ్రోల్ల కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించుకోవాలని చెప్పారు. బంగారు తెలంగాణ తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

KCR speakes about monkies in TRS plenary

పెట్టుబడులకు స్వర్గధామం

తెలంగాణ రాష్ట్రం పెట్టబడులకు స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో జూపల్లి మాట్లాడారు. సీఎం కేసీఆర్ యావత్ తెలంగాణను సంఘటితం చేశారని తెలిపారు. గతంలో ఒక పరిశ్రమకు అనుమతి రావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నెట్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు జనాలు క్యూ కడుతున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ పట్టుదల వల్లనే పది నెలల్లో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నదని ప్రశంసించారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నాయన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

కెసిఆర్ ఒక్కరే...

తెలంగాణలో సామాన్యుడి గురించి ఆలోచించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని పార్లమెంటరీ సెక్రటరీ గొంగిడి సునీత స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వర్‌రావు మౌలిక వసతులపై ప్రతిపాదించిన తీర్మానాన్ని సునీత బలపరిచారు. కనీస వసతులు లేని తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రజల పక్షాన నిలిచింది సీఎం కేసీఆర్ అని చెప్పారు.
మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రహదారులు, విద్యుత్ అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతన్నకు భూగర్భ జలాలు అందించేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వాలు హామీలను కాలరాశాయని విమర్శించారు.

ఓ ట్యాంక్, ఓ రోడ్డు వేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అలా కాకుండా సామాన్యుడి ఉపయోగపడే విధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నీరు, కరెంట్ ఎప్పుడు వస్తదో అని ప్రజలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఆరు నెలల కాలంలోనే నిరంతర విద్యుత్ అందిస్తున్నారం. ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్‌కు సునీత కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరూ ఆపలేరు...

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎవరూ ఆపలేరని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర మౌలిక వసతుల కల్పనపై ఏడో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణలో రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు.

త్వరలోనే మెట్రోరైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణ విషయంలో కేంద్రంతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు.

మూడేళ్లలో విద్యుత్తు కొరత మాయం

రాబోయే మూడేళ్లలో తెలంగాణలో మిగులు విద్యుత్ సాధిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్లీనరీ సమావేశంలో తెలంగాణ విద్యుత్ రంగం, భవిష్యత్‌లో ఉత్పత్తి చేయాల్సిన కరెంట్‌పై ఆరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే విద్యుత్ కోసమని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. చెప్పినట్లుగానే ఆరు నెలల్లోనే నిరంతరం విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. నిరంతర విద్యుత్‌కు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యుత్ రంగంలో నంబర్ 1గా నిలుస్తుందన్నారు. తెలంగాణకు రావాల్సిన గ్యాస్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పారు.

మిషన్ కాకతీయపై ప్రశంసలు

మిషన్‌ కాకతీయ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో ఆయన వ్యవసాయ,నీటిపారుదల,మిషన్‌కాకతీయ కార్యక్రమాలపై ఐదవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 45,600 చెరువుల పునరుద్ధరణ కోసం నడుం బిగించినమని అన్నారు.

మధ్యతరహా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తమని స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినమన్నారు. ప్రాజెక్టులను రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని, బంగారు తెలంగాణ కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కోసమే మిషన్‌కాకతీయ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.

English summary
Telangana CM and Tealangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao said that monkies should be sent to their own places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X