ఏపీలోనూ చంద్రబాబును వదలని కేసీఆర్ - ఢిల్లీ నేతలతో కలిసి: వైసీపీకే దక్కేలా..!!

ఏపీ- తెలంగాణలో ఎన్నకల మూడ్ వచ్చేసింది. ముందస్తుగానే ఎన్నికల వ్యూహాల్లో పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తో కొత్త లక్ష్యాలు సిద్దం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా ఏపీలోనూ ప్రభావం చూపించాలని భావిస్తున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తన పార్టీ ఎంట్రీ ద్వారా టీడీపీని టార్గెట్ చేసే వ్యూహాలు తెర మీదకు తెస్తున్నారు. ఇందు కోసం భారీ ప్రణాళికలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఒక్కరే కాదు.. ఢిల్లీ నేతలు ఇందులో భాగస్వాములు అవుతున్నారు.

ఏపీలో బీఆర్ఎస్ పొత్తు లెక్కలిలా..

ఏపీలో బీఆర్ఎస్ పొత్తు లెక్కలిలా..

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమైంది. ఈ నెలఖారులోగా విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయం ఏర్పటుకు నిర్ణయించారు. స్థలం ఖరారైంది. కొందరు ముఖ్య నేతలతో మంతనాలు సాగుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. ఇప్పటికే రాజకీయాల్లోనే ఉంటున్నా.. పార్టీలకు అతీతంగా ఉన్న వారితో సంప్రదింపులు మొదలయ్యాయి. కేసీఆర్ తెలంగాణలో బీజేపీతో ప్రధానంగా పోరాటం చేస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో మద్దతిచ్చేందుకు టీడీపీ సహకరించే అవకాశం ఉందని గులాబీ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, ఏపీలోనే ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం తాజాగా జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకున్న ఆప్ పార్టీ తో ఇప్పటికే ఒక ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీని వెనుక పక్కా లెక్క ఉంది. తెలంగాణలో ముందుగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీంతో, దేశ వ్యాప్తంగా కలిసొచ్చే పార్టీలతో ఎంపీ సీట్లలో.. ఏపీలో అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తోంది.
టీడీపీ ఓటింగ్ వర్గాలపైనే గురి..

టీడీపీ ఓటింగ్ వర్గాలపైనే గురి..


ఏపీలో సంక్షేమ పథకాలు అమలు ద్వారా లబ్ది దారులు..ప్రధాన ఓటింగ్ వర్గాలు తనకు మద్దతుగా నిలుస్తారని సీఎం జగన్ నమ్మకంతో ఉన్నారు. పథకాలు దక్కని వారు..ఎగువ మధ్య తరగతి ప్రజలు టీడీపీ కే ఈ సారి మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. ఇక, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ కలుపుకొని వెళ్తామని జనసేనాని పవన్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసారు. దీంతో, వైసీపీ పాలన పైన వ్యతిరేకంగా ఉన్న వారు.. టీడీపీకి తప్పని పరిస్థితుల్లో ఓటు వేసే వారికి ప్రత్నామ్నాయంగా నిలబడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మధ్య తరగతి ప్రజలు..యువత ఆప్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ తో కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆప్ -బీఆర్ఎస్ కలిసి కూటమిగా ఏపీలో పోటీ చేయటం ద్వారా రెండు పార్టీలకు మేలు జరుగుతుందనే అంచనాతో ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా సంక్రాంతి సమయంలో అధికారిక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీకి మేలు జరిగేనా - ప్లాన్ వర్కవుట్ అయ్యేనా

వైసీపీకి మేలు జరిగేనా - ప్లాన్ వర్కవుట్ అయ్యేనా

ఏపీలో వైసీపీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నా ఆ పార్టీతో పొత్తు లేదు. ఆ పార్టీతో పాటుగా జనసేనతో పొత్తు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ తో పాటుగా సంచలనాలు ఉంటాయని తాజాగా గులాబీ పార్టీ ముఖ్యనేత స్పష్టం చేసారు. ఏపీలో ఆప్ సైతం విస్తరణ దిశగా కార్యాచరణ ప్రకటనకు సిద్దమైంది. బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న ఆప్ -బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలతో పాటుగా ఏపీలోనూ పొత్తుతో కలిసి వెళ్లనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపుగా నామ మాత్రంగా మారింది. 2018లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారు. ఇప్పుడు ఏపీలో టీడీపీకి కీలకమైన 2024 ఎన్నికల వేళ బీఆర్ఎస్ రూపంలో ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణలో ముందుగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ మూలాలు ఉన్న వారి కుటుంబాలను ఆకర్షించే విధంగా కొత్త ప్రణాళికలను బీఆర్ఎస్ సిద్దం చేస్తోంది. టీడీపీ -వైసీపీ వద్దనుకొనే వారితో పాటుగా తటస్థులు తమ వైపు చూస్తారని విశ్వసిస్తోంది. దీంతో, బీఆర్ఎస్ వ్యూహాలు పరోక్షంగా వైసీపీకి మేలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+