టచ్‌లోనే కెసిఆర్: జైరాం, టి చట్టమని కిరణ్‌కు కౌంటర్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమతో టచ్‌లోనే ఉన్నారని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ బుధవారం చెప్పారు. ఆయన వరంగల్ జిల్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెరాసతో కాంగ్రెసు పార్టీ పొత్తు ఇంకా సజీవంగానే ఉందని చెప్పారు. తెరాసతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
1959కు ముందు భద్రాచలం సీమాంధ్రలోనే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమే భద్రాచలం ముంపు ప్రాంతాలని సీమాంధ్రలో కలిపినట్లు చెప్పారు. హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణకే ఉంటుందని చెప్పారు. రెండు రాష్ట్రాలలోను ఆర్టికల్ 371డి ఉంటుందని చెప్పారు. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడిందని ఆరోపించారు.

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు పదేళ్లపాటు పన్నులు మినహాయింపులు ఉంటాయని తెలిపారు.
లోకసభలో లేని సవరణలను రాజ్యసభలో ఎందుకు తెచ్చారో చిన్నమ్మ చెప్పాలని సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ తెలంగాణ ఆశ, పోలవరం సీమాంధ్ర శ్వాస అన్నారు. తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎప్పుడైనా కోర్టులను ఆశ్రయించే హక్కు ఉందన్నారు. తెలంగాణ ఇప్పుడు బిల్లు కాదని చట్టం అని జైరామ్ రమేషఅ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications