అంజయ్యకు కెసిఆర్ నివాళి: ప్యాకేజీ రెట్టింపని..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ సమాజం గుర్తించుకుని, గౌరవించుకోవాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, కార్మిక నాయకుడు అంజయ్య అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం అంజయ్య వర్ధంతి సందర్భంగా లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి సిఎం కెసిఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు. అంజయ్య వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని కొనియాడారు.

అంజయ్య కార్మికుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అంజయ్య కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అంజయ్య స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

అంజయ్య ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ నియోజకవర్గంలో భారీ విగ్రహం నెలకొల్పుతామని చెప్పారు. త్వరలో ప్రముఖ విద్యాసంస్థకు అంజయ్య పేరు పెడతామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఉద్యానవనానికి కూడా అంజయ్య పేరు పెడతామని కెసిఆర్ వెల్లడించారు.

అంజయ్యకు నివాళి

అంజయ్యకు నివాళి

తెలంగాణ సమాజం గుర్తించుకుని, గౌరవించుకోవాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, కార్మిక నాయకుడు అంజయ్య అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

అంజయ్యకు నివాళి

అంజయ్యకు నివాళి

శనివారం అంజయ్య వర్ధంతి సందర్భంగా లుంబినీ పార్కులోని ఆయన విగ్రహానికి సిఎం కెసిఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు. అంజయ్య వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని కొనియాడారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన గిరిజన సలహామండలి సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గిరిజన సలహామండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

కెసిఆర్ సమీక్ష

కెసిఆర్ సమీక్ష

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. నిర్వాసితులయ్యే గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ప్యాకేజీ ఇస్తామని తెలిపారు.

నిర్వాసితులకు పునరావాసం, అత్యుత్తమ ప్యాకేజీ: కెసిఆర్

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. నిర్వాసితులయ్యే గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువకంటే రెండు రెట్లు ఎక్కువ పరిహారమిస్తామని వెల్లడించారు. ఎకరా రూ. లక్ష ఉంటే వారికి 4లక్షల పరిహారం అందుతుందని తెలిపారు.

తండాలు, గూడెంలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించినట్లు కెసిఆర్ వెల్లడించారు. పంచాయతీల మార్పుపై ఎస్టీ నేతలతో మాట్లాడి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత, విద్యాసంస్థల పరిస్థితిపై అధ్యయనం చేస్తామన్నారు. గిరిజన పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహకాలు అందుకునేందుకు సిద్ధం కావాలని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన గిరిజన సలహామండలి సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గిరిజన సలహామండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+