కెసిఆర్‌తో టాటా డెలిగేట్స్: సానియా నవ్వారు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరారు. హైదరాబాద్‌కు ఐటిఐఆర్ వస్తున్నందున నగరం భారీగా విస్తరించనుందని, ఈ క్రమంలో టాటా వంటి సంస్థలు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. టాటా పవర్ సంస్థ సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సిఎం కెసిఆర్‌తో శుక్రవారం భేటీ అయింది.

రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని టాటా కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా కెసిఆర్‌కు తెలిపారు. రెండేళ్లలో దీనిని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు సిఎంకు చెప్పారు. థర్మల్ పవర్‌ తోపాటు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సరఫరాకు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామని టాటా కంపెనీ ప్రతినిధులు తమ ప్రతిపాదనలను కెసిఆర్‌కు వివరించారు.

బయోవేస్ట్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేసేందుకు టాటా కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లతో పాటు, విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు అవసరమైన పరికరాలను కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి అందిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు సమీపంలో ఐటిఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుందని, ప్రస్తుతం ఉన్న కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కూడా విద్యుత్ అవసరం ఎంతో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 30 నుంచి 40వేల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాలని కెసిఆర్ వారిని కోరారు.

ఇది ఇలా ఉండగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా కొంతసేపు సరదాగా సిఎంతో ముచ్చటించారు. తాను మర్యాదపూర్వకంగానే సిఎంను కలిశానని సానియా మీర్జా తెలిపారు.

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూప్ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరారు.

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

హైదరాబాద్‌కు ఐటిఐఆర్ వస్తున్నందున నగరం భారీగా విస్తరించనుందని, ఈ క్రమంలో టాటా వంటి సంస్థలు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

కెసిఆర్‌తో టాటా ప్రతినిధులు

టాటా పవర్ సంస్థ సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సిఎం కెసిఆర్‌తో శుక్రవారం భేటీ అయింది.

కెసిఆర్‌తో సానియా

కెసిఆర్‌తో సానియా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా కొంతసేపు సరదాగా సిఎంతో ముచ్చటించారు.

కెసిఆర్‌తో సానియా

కెసిఆర్‌తో సానియా

తాను మర్యాదపూర్వకంగానే సిఎం చంద్రశేఖర్ రావును కలిశానని సానియా మీర్జా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+