‘జగన్.. నాయక్ కాదు, ఖల్ నాయక్’
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘జగన్ నాయక్ కాదు... ఖల్‌నాయక్' కృష్ణమూర్తి అన్నారు. ప్రధాని పదవి వదులుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏనాటికీ అధికారంలోకి రాదన్నారు. జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు కర్నూలు నగరంపై అవగాహన పెంచుకోవాలని కేఈ సూచించారు.
సమైక్య రాష్ట్రాన్ని విభజించిన రాక్షసి సోనియా అని ఆయన ధ్వజమెత్తారు.

సీఎం చంద్రబాబు తన ఏడాది పాలనలో ప్రజల మధ్యే వున్నారని మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాల సర్వతోముఖాభివృద్ధికే మినీ మహానాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జగన్ అవగాహన లేకుండా దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో ఏం చేశామో చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications