Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ లో మారుతున్న లెక్కలు - గెలుపెవరిది..!!

ఏపీలో విజయవాడ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. తిరిగి పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. టీడీపీ కూటమి తిరిగి తమ హవా నిరూపించుకోవాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని సోదరులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని లెక్కలు మారుతున్నాయి. దీంతో..ఎంపీ సీటుతో పాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూ గెలుపు ఎవరదినేది ఉత్కంఠ పెంచుతోంది.

ఎంపీ సీటులో హోరా హోరీ
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి తరపున సిట్టింగు ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని), టిడిపి తరపున కేశినేని శివ సాయినాథ్‌ (చిన్ని) పోటీలో ఉన్నారు. నాని రెండు సార్లు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఇక, విజయవాడలో కొత్త సామాజిక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో..ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది పూర్తిగా సామాజిక లెక్కలే డిసైడ్ చేయనున్నాయి. సీట్ల కేటాయింపు నుంచే ఈ దిశగా వ్యూహాలు అమలవుతున్నాయి. తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్‌, గద్దె రామ్మోహనరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన బత్తిన రాము వైసిపిలో చేరడం, కమ్మ సామాజిక తరగతికి చెందిన నేత యలమంచిలి రవి వైసీపీ అభ్యర్ది అవినాశ్ కు అండగా ఉన్నారు

Kesineni Brothers Political fight generated political heat in Vijayawada see deets

మారుతున్న లెక్కలు
సెంట్రల్‌ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఇండియా వేదిక తరపున సిపిఎం అభ్యర్థిగా సిహెచ్‌ బాబూరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లిక విష్ణు సహకారం అంతంతమాత్రంగానే ఉంది. బొండాకు జనసేనతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది. సిపిఎం అభ్యర్థి సిహెచ్‌ బాబూరావుకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. పశ్చిమ వైసిపి అభ్యర్థిగా షేక్‌ ఆసీఫ్‌, కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా జనా చౌదరి పోటీలో ఉన్నారు. ఆసీఫ్‌కు ముస్లిం మైనారిటీ ఓట్లు బలంగా ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రభావం చూపే నగరాలు సామాజిక వర్గం ఓటింగ్ కీలకం కానుంది. మైలవరం వైసిపి అభ్యర్థిగా జడ్‌పిటిసి సభ్యులు ఎస్‌ తిరుపతిరావు, టిడిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ రంగంలో ఉన్నారు. ఉమా నుంచి వసంతకు అంతగా సహకారం లేదు.

Kesineni Brothers Political fight generated political heat in Vijayawada see deets

సామాజిక సమీకరణాలు
సామాన్యుడైన వైసిపి అభ్యర్థి తిరుపతిరావు.. వసంతను ఎదుర్కోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తిరువూరు (ఎస్‌సి) నుంచి వైసిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, టిడిపి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా లాము తాంతియా కుమారి పోటీలో ఉన్నారు. కొలికపూడి దూకుడు మనస్తత్వం టీడీపీకి మైనస్‌గా ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి లాము తాంతియా కుమారి... మాజీ మంత్రి కొనేరు రంగారావు కుమార్తె. ఆమె గతంలో జడ్‌పిటిసిగా గెలుపొందారు. నందిగామ (ఎస్‌సి) నుంచి వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంద వజ్రయ్య రంగంలో ఉన్నారు. జగ్గయ్యపేట వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌తాతయ్య (రాజగోపాల్‌) పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలే గెలుపు ఓటమలను నిర్దేశించనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+