విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముదురుతున్న కేశినేని బ్రదర్స్ వార్ - ఎంపీ నాని ఫిర్యాదు తో కొత్త మలుపు..!!

|
Google Oneindia TeluguNews

బెజవాడ కేంద్రంగా కేశినేని బ్రదర్స్ మధ్య అంతరం కొత్త వివాదాలకు దారి తీస్తోంది. కొంత కాలంగా కోల్డ్ వార్ గా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చకు కారణమవుతోంది. కొద్ది రోజుల క్రితం ఎంపీ కేశినేని నాని పటమట పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇచ్చారు. తన హోదా.. పేరు ఉపయోగిస్తూ గుర్తు తెలియన వ్యక్తులు చలామణి అవుతున్నారంటూ ఫిర్యాదు చేసారు. తాను ఎంపీగా వినియోగించే వాహన స్టిక్కర్ నే నకిలీది తయారు చేసుకొని విజయవాడతో పాటుగా హైదరాబాద్ లో తిరుగుతున్నారని అందులో వివరించారు. వాహనం నెంబర్ సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. టీఎస్07హెచ్‌డబ్ల్యూ 777 అని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కేశినేని ఫిర్యాదుతో మరోసారి

కేశినేని ఫిర్యాదుతో మరోసారి

ఈ ఫిర్యాదు పోలీసు స్టేషన్ కే పరిమితం కాలేదు. ఏకంగా లోక్ సభ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీని పైన పోలీసులు విచారణ చేసారు. ఎంపీ నాని చెప్పినట్లుగా ఆ వాహనం ఆయన సోదరుడే వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కేశినేని నాని సోదరుడు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ నాని ఫిర్యాదుతో ఆ కారును తీసుకెళ్లిన పోలీసులు అన్నీ పరిశీలించారు. టీడీపీ మహానాడు సమయంలోనూ కేశినేని నాని సోదరుడు చిన్ని వ్యవహారం పైన చర్చ సాగింది. ఇద్దరు సోదరుల మధ్య అభిప్రాయబేధాలు రాజకీయ రంగు పులుముకున్నాయి.

చంద్రబాబు ఏది చెబితే అది చేస్తాను

చంద్రబాబు ఏది చెబితే అది చేస్తాను

ఇక, తాజాగా ఎంపీ నాని చేసిన ఫిర్యాదు పైన ఆయన సోదరుడు చిన్ని స్పందించారు. తాను టీడీపీలో చిన్న కార్యకర్తనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏది చెబితే తాను అది చేస్తానని స్పష్టం చేసారు. చంద్రబాబు అధికారంలోకి రావాలనేది తన లక్ష్యమన్నారు. తనకు ఎంపీ నానితో ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఫిర్యాదు ఎందుకు చేసారో తనకు తెలియదన్నారు. కొద్ది రోజుల క్రితం కేశినేని నా శత్రువును నీవు ప్రోత్సహిస్తే..నీ శత్రువును నేను ప్రోత్సహిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు సైతం అప్పట్లో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. నాడు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే నాని ఆ వ్యాఖ్యలు చేసారని అందరూ భావించారు.

ఫ్యామిలీ వివాదం - పార్టీలో చర్చ

ఫ్యామిలీ వివాదం - పార్టీలో చర్చ

విజయవాడ మున్సిపల్ ఎన్నికల వేళ.. కేశినేని నాని - నగర టీడీపీ నేతల మధ్య రాజకీయంగా విభేదాలు బయట పడ్డాయి. దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్‌ మీరా వంటి వారు ఎంపీ కేశినేని తో విభేదిస్తున్నారు. తాజాగా ఎటువంటి వివాదాలు లేకపోయినా, గతంలో మొదలై విభేదాలు ఇంకా ప్రభావం చూపుతున్నాయి. ఇక, తన పైన సొంత పార్టీలోని కొందరు నేతలే సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయంగా నాడు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపైన చర్చ జరిగింది. నాని సోదరుడైన చిన్ని 2014 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతిచ్చారు. కానీ, 2019 ఎన్నికల నుంచి క్రమేణా దూరమయ్యారు.

English summary
Kesineni Nani files Complaint agains his borther chinni in vijayawada, cold war between the brothers is in peak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X