బెజవాడ టీడీపీలో బిగ్ బాంబ్..? పేలడమే తరువాయి
ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పైకి అంతా బాగానే ఉందనిపిస్తున్నప్పటికీ, లోలోపల మాత్రం టీడీపీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా జిల్లాలో కూటమి ప్రభుత్వం క్లీన్‌స్వీప్ చేసింది. అన్నీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అయితే గెలిచిన కొంతకాలానికే నాయకుల మధ్య అధపత్య పోరు మొదలైంది.
ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని టీడీపీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో పార్టీ అంటిముంటన్నట్టుగానే వ్యవహారిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఆయన ఎత్తి చూపిస్తున్నందుకే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ అధినాయత్వం దూరం పెడుతుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. జగన్‌ను తిట్టడానికి కాదు మనల్ని ప్రజలు ఎన్నుకుంది, వారికి మంచి చేయడానికి అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఎస్సీ సెల్ సమావేశం-కొలికపూడికి అందని ఆహ్వానం
ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానంపై కూడా ఆయన తన గళాన్ని విప్పారు. జగన్ ప్రభుత్వంలో కేవలం వైన్స్ షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరిగేవని, కానీ ఇప్పుడు బడి, గుడి, బస్ స్టాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. దీంతో పద్దతి మార్చుకోవాలంటూ ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయినా ఆయనలో ఎటువంటి మార్పు రాకపోయే సరికి ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరం చేసే విధంగా ఎంపీ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు బుధవారం జరిగిన తిరువూరు ఎస్సీ సెల్ సమావేశానికి ఎమ్మెల్యే కొలికిపూడిని దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. శావల దేవదత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ పాల్గొన్నారు. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే అందునా దళిత ఎమ్మెల్యే కొలికపూడి లేకుండా ఈ సమావేశం జరగడం పై జిల్లా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు కథ టీడీపీలో ముగిసినట్టే అనే చర్చ జోరుగా సాగుతోంది.ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యే ఎంపీపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
కేశినేని చిన్ని వర్సెస్ తంగిరాల సౌమ్య: మరో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం కూడా పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. దళిత మహిళా ఎమ్మెల్యేను ఎంపీ అవమానించారనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. నందిగామ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున తంగిరాల సౌమ్య విజయం సాధించారు. అయితే చంద్రబాబు పర్యటనలో హెలికాప్టర్ వద్దకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె వర్గం దళిత మహిళా ఎమ్మెల్యేకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిపై వివరణ కోరగా, ఎంపీ కేశినేని చిన్ని సూచించిన పేర్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికారులు తెలిపారు. దీంతో ఎంపీపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్లు ఖరారు చేయడానికి ఎంపీ ఎవరని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కేశినేని చిన్ని వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్: ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కూడా ఎంపీ చిన్నికి అంతగ పొసగడం లేదని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ, కొండపల్లి వద్ద దొరికే బూడిద విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీ కేశినేని చిన్ని విభేదాలు కొని తెచ్చుకుంటున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా టీడీపీ రోడ్డున పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుకుంటున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టతరం అవుతుందనే చర్చ సాగుతోంది. మరి పార్టీలో చోటు చేసుకున్న విభేదాలపై టీడీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications