టైమ్ చెప్పబ్బా జేసీ ప్రభాకరా.. నేనే వస్తా గానీ: తాడిపత్రి రచ్చ
తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ కుటుంబ పాలన, అయిదేళ్ల తన పాలనపై రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. పౌరుషాల పేరుతో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం మానేసి, రాజకీయంగానో లేదా అభివృద్ధి పరంగానో ఎదుర్కోవాలని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ఏదైనా ఉంటే రెండు కుటుంబాలం చూసుకుందాం తప్ప, అమాయకులను బలి చేయడం మానుకోవాలని హితవుపలికారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పెద్దారెడ్డి సమర్థించారు. ఆయన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలే తప్ప తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతానంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత పౌరుషాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు.

తాడిపత్రి డివిజన్ లో ఎస్పీ ఆదేశాలతో కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పనిచేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అమాయకులపై మట్కా కేసులు బనాయిస్తున్నారని, అసలు నిందితులను వదిలేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని పౌరుషాల గురించి మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు.
ముఖాముఖి తేల్చుకోవడానికి సిద్ధమా? అని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఏం జరిగినా కేసులు పెట్టవద్దని ముందే లేఖ రాసి పోలీసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని తన కొడుకు గురించి మాట్లాడే ముందు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక హైదరాబాద్ కి పరిమితమైన తన అన్న కొడుకు గురించి ఆలోచించాలని హితవు పలికారు.
ఎర్రవంక పైన విచారణ జరిపి సర్వే చేయాలని, తాడిపత్రి రూరల్ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ. 1.20 కోట్ల స్కామ్ జరిగిందని, గ్రామంలో లేని వ్యక్తులకు బిల్లులు చేశారని ఆధారాలతో సహా కలెక్టర్ ఆఫీసులో తాను ఆధారాలతో ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదని, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డే విచారణ జరగనీయకుండా అడ్డుకుంటున్నాడని పెద్దారెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేగా కలెక్టర్‌కి నేరుగా తానిచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజానీకం ఇచ్చిన ఫిర్యాదులను ఈ ప్రభుత్వం ఎలా పట్టించుకుంటుందని ప్రశ్నించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications