జనసేనకు గుడ్ బై చెప్పిన కీలక నేత .. ఏమన్నారంటే

ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జనసేన పార్టీ నేతలు దిక్కు తోచనిస్థితిలో ఉన్నారు . ఓటమి అనంతరం మీడియా ముందుకొచ్చి ముక్తసరిగా రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళిపోయిన పవన్ పార్టీ శ్రేణుల్లో కావాల్సిన స్థైర్యం నింపలేదు . కార్యకర్తల్ని, పోటీచేసిన అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ, భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది కానీ చెప్పలేదు.

దీంతో అసలే ఓటమి బాధలో ఉన్న అభ్యర్థులు కొందరిలో అసహనం పెరిగిపోతుంది. కనీసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గెలవకపోవటంతో పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. చాలా మంది జనసేన నేతలు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు.తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వం ప్రభాకర్ రెడ్డి తాను పార్టీకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Key leader said Good Bye to Janasena ..what he said his ,,,?

పార్టీలో సరైన సహాయ సహకారాలు అందకపోవడం వల్లనే తాను పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. తన ఓటమికి కూడా అవే కారణాలని ఆయన చెబుతున్నారట. ఈయనలాగే ఇంకొంతమంది పార్టీని వీడకముందే పవన్ పార్టీ వ్యవహారాల్ని వేగవంతం చేసి నేతల్లో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొందరు జనసైనికులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+