వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి షాక్ ఇచ్చిన నేత .. టీడీపీలో చేరిక .. 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం అన్న బాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీలో చేరిన అరకు వైసీపీ నేత దొన్ను దొర || YSRCP Araku Leader Donnu Dora Joined In TDP || Oneindia

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస షాకులు ఇస్తుంటే ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సొంత పార్టీకి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం ఒకసారి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి మారి ఇలాంటి నిర్ణయం ఎవరైనా తీసుకుంటారా అన్న భావన కలిగించింది.

ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరుఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరు

 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వలసల పర్వం .. టీడీపీకి షాకిస్తూ జంప్ అవుతున్న నేతలు

ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వలసల పర్వం .. టీడీపీకి షాకిస్తూ జంప్ అవుతున్న నేతలు

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నుండి వలసల బాట పట్టారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అయితే అసెంబ్లీ వేదికగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వలసలను ప్రోత్సహించనని తేల్చిచెప్పారు . ఒకవేళ ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి వస్తేనే వైసీపీ లోకి ఆహ్వానిస్తామని చెప్పిన జగన్ ప్రతిపక్ష పార్టీల నేతలకు తలుపులు మూసేశారు. ఇక దీంతో బిజెపి లోకి వలసలు జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు కూడా కాకుండానే ప్రతిపక్ష టిడిపికి షాక్ లు ఇస్తూ పార్టీ నేతలు కాషాయ తీర్థం తీసుకుంటున్నారు.ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లిపోగా ఒక్కొక్కరుగా టిడిపి ని వీడి బయటకు వెళ్లడానికి సంసిద్ధమవుతున్నారు.

సైకిల్ ఎక్కిన వైసీపీ నేత దొన్ను దొర ... జోష్ లో టీడీపీ

సైకిల్ ఎక్కిన వైసీపీ నేత దొన్ను దొర ... జోష్ లో టీడీపీ

వలసలతో కుదేలవుతున్న టిడిపికి వైసీపీకి చెందిన నేత టిడిపిలో చేరడం కాస్త జోష్ ఇచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వైసిపి నేత టీడీపీలో చేరి అటు వైసీపీ నే కాదు, రాష్ట్ర ప్రజలను సైతం షాక్ కు గురి చేశారు. సహజంగా ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఉండాలని ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది వైసీపీకి చెందిన దొన్ను దొర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగు దేశం పార్టీ తీర్థం తీసుకున్నారు.

గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ..ఓటింగ్ లో రెండో స్థానంలో దొన్నుదొర

గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ..ఓటింగ్ లో రెండో స్థానంలో దొన్నుదొర

గత ఎన్నికల్లో దొన్ను దొర అరకు నుంచి వైసీపీ అసెంబ్లీ సీటు ఆశించారు. టిక్కెట్ రాకపోవడంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన దొన్ను దొర రెండో స్థానంలో నిలిచారు. దొన్ను దొరతో పాటు అరకు నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. దొన్ను దొరకు స్థానికంగా అరకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇక దీంతో అరకులో మంచి పట్టున్న నేత టిడిపిలో చేరడంతో చంద్రబాబు సంతోషంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత అధికార పార్టీకి చెందిన నేతల టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదేమైనా దొన్ను దొర తీసుకున్న నిర్ణయం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.

 జగన్ 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం అన్న చంద్రబాబు

జగన్ 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం అన్న చంద్రబాబు

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దొన్ను దొర పార్టీలో చేరిన సందర్బంగా.. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం లాంటిదని అన్నారు. వంద రోజుల్లో వైసీపీ పార్టీ పనితీరు బయటపడిందన్నారు. ఆ పార్టీ చేస్తోన్న అరాచకాలకు.. టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారని పేర్కొన్న ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేఖత ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు.

English summary
Many Telugu Desam Party leaders are looking for other alternatives now. While a few of them are looking towards BJP, a few are in touch with YSRCP and might be switching loyalties sooner or later.However, the latest reports are indicating an interesting development.Reportedly, key leader of YSRCP Donnu Dora has joined in Telugu Desam Party. He met with Chandrababu and joined the yellow party.Rarely do we see ruling party leaders joining in opposition parties. This is leaving YSRCP forces worried. Donnu Dora came second in Araku assembly election where he contested as YCP rebel MLA. He garnered more votes than TDP candidate Kidari Sravan. So, Donnu Dora’s addition should come as a big boost to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X