ఖరగ్‌పూర్ ఐఐటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

 Kharagpur IIT student commits suicide
ఖరగ్‌పూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటి ఖరగ్‌పూర్‌లో బోగ శ్రవణ్ అనే తెలుగు విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

శ్రవణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది నల్లగొండ జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం గ్రామం అని తెలుస్తోంది. క్యాంపస్ సెలెక్షన్ ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

ఐదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

ఇదిలావుంటే, హైదరాబాదు నగర శివారు రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కీర్తన అనే ఐదేళ్ల బదిర వికలాంగ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలి ఇంటి సమీపంలో గల ప్లాస్టిక్ గోదాంలోని ఓ గదిలో కీర్తన మృతదేహాన్ని గుర్తించారు.

గత రెండు రోజుల క్రితం మృతురాలు అదృశ్యమైనట్లుగా మైలార్‌‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కీర్తనది హత్యా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+