12గం.ల యాత్ర: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం(పిక్చర్స్)
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గణేషుడి శోభాయాత్రను ప్రారంభించారు. వర్షం కురవడం, ఇతరత్రా కారణాలతో గణేషుడి శోభాయాత్ర ఆలస్యమైంది.
ప్రతి ఏటా వేకువజామున నాలుగు, ఐదు గంటల వరకే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది భారీగా చేరుకున్న భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తుండగా 59 అడుగుల భారీ గణేషుడిని నిమజ్జనం చేశారు. గణేషుడి శోభాయాత్ర రాత్రి రెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది.
కాగా, గణేష్ విగ్రహాల నిమజ్జనం సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరో వెయ్యి విగ్రహాల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాదు రోడ్డులో క్రేన్‌లు అలాగే ఉన్నాయి.

ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
59 అడుగుల భారీ ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర బుధవారం అర్ధరాత్రి రెండు గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సాగర్‌లో నిమజ్జనం జరిగింది.

జన సందోహం
భారీ ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు తరలి వచ్చిన భక్తులు. ఖైరతాబాద్ లంబోదరుడి శోభా యాత్ర దాదాపు పన్నెండు గంటలు సాగింది.

భక్తులు
భారీ ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు భక్తులు తరలి వచ్చారు. ఖైరతాబాద్ లంబోదరుడి శోభా యాత్ర దాదాపు పన్నెండు గంటలు సాగింది.

నిమజ్జనం
59 అడుగుల భారీ ఖైరతాబాద్ వినాయకుడు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సాగరంలో నిమజ్జనమయ్యాడు. నిమజ్జనం చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.

ఖైరతాబాద్
తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకున్నాడు. ఓ వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు అమ్మవార్లు కొలువయ్యారు.

తరలుతున్న గణనాథుడు
తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడిని సాగరంలో నిమజ్జనం అయ్యేందుకు బుధవారం రాత్రి రెండు గంటలకు తరలించారు.

ఏకదంతున్ని చూసేందుకు
ఖైరతాబాద్ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఇసుక రాస్తే రాలనంత జనం వచ్చారు. వినాయకుడి గురువారం నిమజ్జనం అయ్యే వరకు ఏకదంతుడిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.












Click it and Unblock the Notifications