ఏపీ కేబినెట్ విస్తరణ: ఫరూక్, శ్రవణ్ ప్రమాణం, అనూహ్యంగా చోటు దక్కించుకున్న కిడారి

విజయవాడ: మంత్రులుగా ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్‌లు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. వారిద్దరితో గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిద్దరిని కేబినెట్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని 164(4) అధికరణను అనుసరించాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.

మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఫరూక్ స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో మైనార్టీ మంత్రిగా పని చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మైనార్టీ మంత్రిగా ఉన్నారు. 2017 నవంబర్ నుంచి మండలి చైర్మన్‌గా ఉన్నారు. కిడారి శ్రవణ్.. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతి చెందిన కిడారి సర్వేశ్వర రావు తనయుడు.

Kidari Sravan and Farooq inducted in AP cabinet

ఎన్ఎండీ ఫరూక్‌కు మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. వైద్య, ఆరోగ్య శాఖను కూడా అప్పగించే అవకాశముంది. ఈయన పూర్తి పేరు నశ్యం మహ్మద్ ఫరూక్. సొంత స్థలం నంద్యాల. పదో తరగతి చదువుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం ఉంది. 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సెలర్‌గా ఎన్నికయ్యారు. 1981లో వైస్ ఛైర్మన్‌గా అయ్యారు.

శ్రవణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ అప్పగించారు. ఇతను ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తండ్రి మరణంతో అనూహ్యంగా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వారణాసిలో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+