'కిరణ్ కమిట్ ఐతే, దత్తపుత్రుడితో రాత్రికి రాత్రే ఒప్పందం'

కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారన్నారు. ఆయన ఒక్కసారి కమిట్ అయితే ఎవరు చెప్పినా వినర్న్నారు. ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా విభజనపై కేంద్రం, పార్టీ అధిష్టానం ముందుకు వెళ్లడాన్ని దేశం యావత్తు చూస్తోందన్నారు. తానే కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్లు కూడా విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని మార్చడం ఎవరి తరం కాదన్నారు.
రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందని అధిష్టానంబై ధ్వజమెత్తారు. మైనార్టీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. భద్రాచలం కావాలంటున్న తెలంగాణ వాళ్లు విశాఖ, కడప, కర్నూలు, అనంతపురంలను ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు.
తెలుగుజాతిని విచ్ఛిన్నం చేస్తున్న వారిపై దూకుడు ప్రదర్శిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. ప్రభుత్వం మనుగడే సందిగ్ధంలో పడనుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చాలా పార్టీలు కాంగ్రెసుకు దూరమవుతాయని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ముసాయిదా బిల్లు ముఖ్యమంత్రికే మొదట చేరుతుందన్నారు. విభజనపై నిర్ణయం మార్చుకుంటే 30 సీట్లు గెలుస్తామన్నారు. 125 ఏళ్ల కాంగ్రెసు చరిత్రలో ఇది ఘోర నిర్ణయమన్నారు. దత్తపుత్రుడితో రాత్రికి రాత్రే ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications