రెబల్ భారం కిరణ్‌పై, బుజ్జగింపు: టిపై కాంగ్ కోర్ కమిటీ

వారిని అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో అధిష్టానం జోరుగా బుజ్జగింపు చర్యలు చేస్తోంది. ఏఐసిసి నేతలు రెబల్ అభ్యర్థులకు ఫోన్ చేసినా వారు స్పందించడం లేదు. పర్యవేక్షకులుగా వచ్చిన కుంతియా, తిరునావుక్కరసుల ఫోన్లకు వారు అందుబాటులో లేరు.
దీంతో అధిష్టానం చైతన్య, ఆదాలు నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసే బాధ్యతను కిరణ్ పైన వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చైతన్య రాజుతో భేటీ అయ్యారు. ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. అయితే, చైతన్య మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదిలేదని, పోటీలో నిలబడుతానని కిరణ్‌కు చెప్పినట్లుగా సమాచారం.
ఢిల్లీలో కోర్ కమిటీ భేటీ
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు పైన న్యాయ సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోమవారం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. వచ్చే పార్లమెంటులోనే బిల్లు పెట్టాలని కోర్ కమిటీ సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications