నేను చెప్పింది నిజమౌతుంది, కష్టమే!: విభజనపై కిరణ్
హైదరాబాద్: విభజన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు పలు సమస్యలు ఎదురవుతాయని కిరణ్ కుమార్ రెడ్డి నాడు చెప్పిన విషయం తెలిసిందే.
ఆయన వాటిని మరోసారి పల్లె వేశారట. విభజనతో విద్యుత్తు, నీటి వివాదాలు వస్తాయని తాను చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అంత సులభం కాదని కిరణ్ అభిప్రాయపడ్డట్లుగా సమాచారం.

కాగా, రెండు, మూడేళ్ల తర్వాతే రాజకీయ భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గురువారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే.
రెండు, మూడేళ్ల పాటు ఖాళీగానే ఉంటానని, కాంగ్రెసు పార్టీ పరిస్థితి, కేసుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం, తెలుగుదేశం పార్టీ పైన ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్న అంశాలను బేరీజు వేసుకొని ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications