జగన్‌కు లక్షల కోట్లు, కెసిఆర్‌కు లక్షల తిట్లు: హరీష్

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతికి పాల్పడి డబ్బును అక్రమంగా కూడ బెట్టాడని, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు సంతోష్‌రెడ్డి అదే విధంగా కూడబెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సిబిఐతో విచారణ జరిపిస్తే జగన్‌కు పట్టిన గతే కిరణ్‌కు పడుతుందన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర కిరణ్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం, సిడబ్ల్యుసి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడితే ముఖ్యమంత్రి అడ్డుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. శాసనసభను ప్రోరోగ్ చేయకుండా గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడేనని ఆయన అన్నారు. భద్రాచలం ప్రజలపై ప్రేమతో సీమాంధ్రులు దాన్ని కావాలనడం లేదని అక్కడ పోలవరం నిర్మాణాన్ని చేపట్టి ముంచడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
జగన్ తన తండ్రిని అడ్డంపెట్టుకుని రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తే, సీమాంధ్ర నాయకులతో కేసీఆర్ పది లక్షల కోట్ల తిట్లను సంపాదించుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో పర్యటించినప్పుడు జగన్‌బాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడని బైబిల్ పట్టుకుని ప్రకటన చేసిన విజయమ్మ, ఇప్పుడు తెలంగాణను అడ్డుకోవడానికి జగన్ ఎందుకు కుట్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications