బోటు ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వండి .. ఏపీ సర్కార్ ను కోరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

గోదావరి నది కచ్చులూరు వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. బోటు ప్రమాద ఘటనలను నివారించడానికి ఒక విధానం తీసుకురాలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గోదావరి నదిలో మునిగి పోయిన బోటును ప్రస్తుతం బయటికి తీసే అవకాశం లేదని చెప్పిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

అవసరమైన సాంకేతిక సహకారం అందించి బోటును బయటికి తీయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
జాతీయ విపత్తు నివారణ కమిటీ సమావేశానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బోటు ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని జగన్ సర్కార్ ను కోరినట్లు గా చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం హాజరయ్యారు. బోటు ప్రమాదాలు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన ప్రమాదాలను నివారించడానికి గల మార్గాలను సూచించడానికి నిపుణుల కమిటీ పనిచేయాలని కోరారు.

Kishan Reddy asked Jagan government to submit a report on boat mishap

రాజమండ్రి లోని రోడ్లు మరియు భవనాల అతిథిగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేసిందని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఇక కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై జగన్ సర్కార్ ను నివేదిక కోరామని చెప్పిన కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా ఇలాంటి జల విపత్తులు జరగకుండా ఒక పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+