వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుల గురించేనా: బాబుపై కిషన్ రెడ్డి, టి బాధ్యత మాదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

kishan reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. బిజెపితో పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాత్రం ఆ విషయం చంద్రబాబునే అడగాలని, ఇంకా చర్చలే జరగలేదని చెబుతున్నారు. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై తమ పార్టీలో ఏ స్థాయిలోనూ, ఎక్కడా ఇప్పటివరకు చర్చ జరగలేదన్నారు.

ఇప్పటి వరకు పొత్తులపై పార్టీ ఎలాంటి విధాన నిర్ణయమూ తీసుకోలేదన్నారు. బిజెపితో కలిసి పయనించాల్సి ఉంటుందంటూ చంద్రబాబు చెబుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు రాగా పై విధంగా స్పందించారు. పొత్తుల విషయంలో కిషన్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, జాతీయ నేతలతో చర్చిస్తున్నామంటూ బాబు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా అ విషయం గురించి బాబునే అడగాలన్నారు.

తమ పార్టీ జాతీయ నేతలను చంద్రబాబు కలిసినంతన మాత్రాన అది పొత్తుల గురించే అని ఎందుకనుకుంటారని ప్రశ్నించారు. తాను శనివారం కూడా జాతీయ నేతలతో మాట్లాడానని, శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశానని, అసలు పొత్తుల ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. ఇప్పుడే తాము ఓట్లు, సీట్ల కోసం ఆరాట పడడం లేదని, ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎందులో విలీనమవుతుందో ఇప్పుడే తెలియదన్నారు. తమకు ప్రస్తుతం పొత్తులు ముఖ్యం కాదని, తెలంగాణ సాధనే తమ ప్రధాన ఎజెండా అని స్ప ష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ అంశం గురించి కిషన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత విద్యాసాగర రావుతో కలిసి వేరుగా మాట్లాడారు. బిల్లును గట్టెక్కించే బాధ్యత తమదే అన్నారు. తెలంగాణపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గమని, తమ మద్దతు లేకుండే బిల్లు పాస్ కాదన్నారు. సవరణలు సూచించే బాధ్యత తమ పైన ఉందన్నారు. కాంగ్రెసు కుట్రలను తిప్పి చెప్పేందుకే చర్చకు పట్టు బట్టామని, తామైతే కిరణ్‌ను ఒక్క రోజులో తొలగించే వాళ్లమన్నారు. సిఎంను వెనుకేసుకొస్తున్న డిగ్గీకి సిగ్గుంటాలని ధ్వజమెత్తారు.

English summary
Bharatiya Janata Party state president Kishan Reddy on Saturday denied tie up with Telugudesam Party in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X