మజ్లిస్ దయతో కాదు: సల్మాన్‌ఖాన్‌పై కిషన్ రెడ్డి కౌంటర్

నరేంద్ర మోడీని పొగిడినందుకు సల్మాన్ ఖాన్ సినిమాలు చూడొద్దని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాదు పార్లమెంటు సభ్యులు, ఇతర ఆ పార్టీ నేతల పైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అంశంపై స్పందిస్తూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం సూచనల మేరకే నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్మాణంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ దర్శకత్వంలో కిరణ్ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, సంక్రాంతి పర్వదినం రోజున మోడీతో కలిసి సల్మాన్ ఖాన్ పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా మోడీని పొగడ్తలలో ముంచెత్తారు. అదే సమయంలో 2002 గోద్రా అల్లర్ల పైన క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదన్నారు. దీనిపై మజ్లిస్ పార్టీ మండిపడింది. ఆయన తాజా సినిమా జయహో చూడవద్దని తన మద్దతుదారులకు సూచించింది.












Click it and Unblock the Notifications