రెండ్రోజుల్లో చెప్తా: కిషన్ రెడ్డితో పవన్, ఫ్యాన్స్‌కు పిలుపు

ఈ నేపథ్యంలో పవన్‌ను కిషన్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బిజెపి తరఫున ప్రచారం చేయాలని పవన్‌ను కిషన్ కోరారు. దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించారని, హామీ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీలో చర్చించి రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మోడీకి మద్దతు పలికిన పవన్ ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు విజయవాడ వెస్ట్ టిడిపి అభ్యర్థి బొండా ఉమ పవర్ స్టార్‌ను కలిసి మద్దతు కోరారు.
కాగా, పవన్‌ను ప్రచారంలో దింపేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రెండు ప్రాంతాల్లోనూ ప్రచారానికి వీలుగా పవన్ డేట్ల కోసం సంప్రదించే పనిలో ఉన్నదని ఊహాగానాలు వినిపించాయి.
మరోవైపు, జనసేన జెండాలతో బిజెపి, టిడిపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ సీమాంధ్ర 13 జిల్లాల అభిమానులకు పిలుపునిచ్చారంటున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో అభిమాన సంఘాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.
కేంద్ర, రాష్ట్రాల్లో అవినీతి, అసమర్థ పార్టీలు గద్దెనెక్కకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత అభిమానులపై ఉందన్నారు. జనసేన జెండాలతో ప్రచారం చేయాలని సూచిస్తూ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications