నాయిని ఏం చెప్తున్నారు?: నల్గొండ ఎన్‌కౌంటర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: నల్గొండ జిల్లా కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని, హోంమంత్రి నిర్లక్ష్యంగా ప్రకటన చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటన సరికాదన్నారు.
ఎన్‌కౌంటర్‌లో హతమైన దుండగులు దోపిడీ దొంగలేనని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి నిర్లక్ష్యంగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు సహకరించాలన్నారు.
విచారణకు ఆదేశించాం: చినరాజప్ప

నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్లో మృతి చెందిన వ్యక్తుల వద్ద విజయవాడ బస్సు టిక్కెట్ ఉందని తెలిసిందని, దీని పైన విచారణకు ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప ఆదివారం చెప్పారు.
కాగా, నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అస్లాం, జకీర్ అనే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. ఖాండ్వా జైలు నుండి తప్పించుకొచ్చిన వారిలో వీరు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సిమీకి చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ ముఠాలో వీరిద్దరు కీలక సభ్యులను చెబుతున్నారు.












Click it and Unblock the Notifications