ఎబిఎన్, టీవీ9: కిషన్ లేఖ, తమకేం లేవని నన్నపనేని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించడాన్ని ఆపాలని, పత్రికా, ప్రసార సాధనాల స్వతంత్రతను కాపాడాలని లేఖలో కోరారు.

నన్నపనేని ఆవేదన

విభజన వల్ల తెలంగాణ అంతా వడ్డించిన విస్తరి అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో విస్తరాకు కూడా లేదని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. సోమవారం శాసనమండలిలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. పంచభక్ష్య పరమాన్నాలు ఒకవైపు ఉండగా, ఇక్కడ పచ్చడి మెతుకులు కూడా లేవన్నారు.

Kishan Reddy writes letter to Governor

తెలంగాణలో అన్ని వసతులతో కూడి భవనాలు ఉన్నాయని, ఏపీలో ఏమీ లేదన్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై పెదవి విరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ వచ్చే రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కష్టకాలమన్నారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సమావేశమయ్యారు. గురుకుల భూముల స్వాధీనం, విద్యుత్ సమస్య, నదీ జలాల పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ తదితర అంశాలపై గవర్నర్‌తో చర్చించాలని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+