భూమా తనయుడి హల్‌చల్: పోలింగ్ కేంద్రంలోకి, భయపడొద్దని శిల్పా తనయుడు
నంద్యాలలోని మిట్నాలలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్ రెడ్డి హల్‌చల్ చేశారు. పోలింగ్ జరుగుతుండగా.. కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు.
కర్నూలు: నంద్యాలలోని మిట్నాలలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్ రెడ్డి హల్‌చల్ చేశారు. పోలింగ్ జరుగుతుండగా.. కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
కాగా, ఈ ఘటనపై శిల్పా మోహన్ రెడ్డి తనయుడు కిషోర్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని, ఎవరు కూడా భయపడొద్దని అన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు.

మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం శుభసూచకమని అన్నారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు.
బుధవారం ఉదయం శిల్పా మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆగస్టు 28న విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications