వంశీ క్షమాపణల వెనుక - జూ ఎన్టీఆర్ లింకు ఏంటి : చివరి వరకూ జగన్ తోనే..అందుకే..!!
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన గతంలో తాను చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారిస్తున్నానంటూ.. భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. అయితే, వంశీ క్షమాపణలు చెప్పటం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే అంశం పైన వంశీ స్పందించారు. ఎవరో బెదిరింపులు.. పకోడి గాళ్ల హెచ్చరికలతో తాను క్షమాపణ చెప్పలేదని వంశీ స్పష్టం చేసారు. తనకు భువనేశ్వరి అంటే గౌరవమని...అయితే, ఒక విషయం పైన స్పందించే క్రమంలో పొరపాటున నోరు జారానని వివరించారు.
Recommended Video

మమ్మల్ని బెదిరించే వాళ్లెవరూ లేరు
తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని..అమె సైతం అదే అభిమానం చూపించేవారని చెప్పుకొచ్చారు. తన మనసుకు ఆమె పేరు తో అలా మాట్లాడటం సరి కాదని చెప్పి... క్షమాపణ చెప్పానన్నారు. తమను ఒత్తిడి చేసే వారో...బెదిరించే వాళ్లో లేరని వంశీ తేల్చి చెప్పారు. తన ఇంట్లో మహిళలను టీడీపీ నేతలు చాలా దారుణంగా కించ పరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఇష్యూ లో 5 శాతం తన తప్పు ఉంటే..చంద్రబాబు తో సహా టీడీపీ నేతల తప్పు 95 శాతం తప్పు ఉందన్నారు. తాను సంస్కారంతో క్షమాపణ చెప్పానని..పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో మా ఇంట్లో వారిని తిట్టించినందుకు వాళ్లు క్షమాపణ చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు. వాళ్లు లాగా తాను ఉండకూడదని సంస్కారంతో క్షమాపణ చెప్పానన్నారు.

నిజాయితీగా క్షమాపణ చెప్పాను
తప్పు మాట్లాడటంతో నిజాయితీగా క్షమాపణ చెప్పానని వంశీ స్పష్టత ఇచ్చారు. తాను..కొడాలి నాని ఎక్కడ ఉన్నా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. తాము టీడీపీలో ఉన్న సమయంలో తాను..కొడాలి నాని వంద కోట్లు ఖర్చు చేసామని చెప్పారు. తనతో పాటుగా కొడాలి నాని పైన లోకేశ్ సోషల్ మీడియా ద్వారా డామేజ్ చేసే ప్రయత్నం చేసారన్నారు. తాను ఇదే విషయాన్ని లోకేశ్ కు సైతం స్పష్టం చేసానన్నారు. వెయ్యి మందిని సోషల్ మీడియా సిబ్బంది కింద తీసుకొని వారితో టార్గెట్ చేయిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు..లోకేష్ పైన పోరాటం ఆగదు
చంద్రబాబు..లోకేష్ ను విధాన పరంగా విమర్శిస్తానని..అందులో తగ్గేది లేదని వంశీ తేల్చి చెప్పారు. తాము దేవినేని లాగా సూటుకేసులు మోయలేదన్నారు. లోకేష్ లాగా సూటుకేసులు తీసుకోలేదని చెప్పారు. చంద్రబాబు కులం ..మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కమ్మ హాస్టల్ లోనో..కమ్మ కాలేజీలోనో చదువుకోలేదని స్పష్టం చేసారు. తాన కులం పేరుతో రాజకీయం చేసే ఉన్మాదిని కాదని వెల్లడించారు. అసలు కమ్మ వర్గం ఎక్కువగా ఉంది ఖమ్మం జిల్లా అని..అటువంటిది అక్కడ టీడీపీకి ఏ మేర మద్దతు ఉందని వంశీ ప్రశ్నించారు.

గాంధీ తన పని తాను చూసుకోవాలి
అరికెపూడి గాంధీకి చంద్రబాబు మీద ప్రేమ ఉంటే పార్టీని వీడి టీఆర్ఎస్ లో ఎందుకు చేరారని ప్రశ్నించారు. లోకేశ్ కు అభద్రతా భావం ఉందన్నారు. తాను..కొడాలి నాని మీద ఒక అభిప్రాయం ఉండేదని..తామిద్దరం జూనియర్ ఎన్టీఆర్ పల్లకి మోస్తామనే భయం ఉందన్నారు. తాము అది చేయమని చెప్పారు. తాము ఇప్పుడు జగన్ తో ఉన్నామని..జగన్ కోసం నిలబడతామని...చివరి వరకూ జగన్ తోనే ఉంటామని..అందుకే ఇంతలా తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ మీద కుల ప్రభావం ఏదీ లేదని స్పష్టం చేసారు.

జగన్ తో చివరి వరకూ ఉంటా
అన్ని వ్యవస్థల్లో..పార్టీల్లోకి తన మనుషులను పంపి..వారితో మేనేజ్ చేసుకోవటం అలవాటని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెబితే తాము ఎంతమందిని తిట్టామో తమకే తెలుసన్నారు. కమ్మ వర్గాన్ని ఇతర వర్గాలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని...అది భవిష్యత్ లో నష్టం చేస్తుందన్నారు. వర్ల రామయ్య వ్యాఖ్యల పైన వంశీ కీలక వ్యాఖ్యలు చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి అవసరం లేదని వర్ల అన్న విషయాన్ని గుర్తు చేసారు. వర్ల రామయ్య పలావు ప్యాకెట్ల కోసం మాట్లాడుతారని..అటువంటి వాళ్ల గురించి మాట్లాడటం తన స్థాయి కాదన్నారు. గన్నవరం ఇన్ ఛార్జ్ గా వచ్చి డబ్బులు తీసుకున్నారని వంశీ చెప్పుకొచ్చారు. అయితే, తాను ఎందుకు క్షమాపణ చెప్పిందీ వివరించిన వంశీ..చంద్రబాబు పైన విధాన పరమైన ప్రశ్నలు కంటిన్యూ అవుతాయని తేల్చి చెప్పారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications