చంద్రబాబు గజనీ, అన్నీ మరిచిపోతాడు: కొడాలి నాని
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు గజనీ అని, చేసినవి మరిచిపోతాడని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
హైదరాబాదులోని ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలనే అర్హత ఎవరికీ లేదని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఏమైనా చేస్తామని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ లబ్ధి కోసమే విభజిస్తున్నారని పార్టీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలు సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి అడ్డగోలుగా నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విభజనను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
సమైక్య శంఖారావం సభ రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు గట్టు రామచంద్ర రావు అన్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య సమరం కాదని, రెండు విధానాలకు సంబంధించిన సమరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications