భువనేశ్వరి వ్యాఖ్యలపై కొడాలి నాని, పవన్ కళ్యాణ్ కు చురకలు, తెలంగాణా ధాన్యం రగడపైనా సెన్సేషన్
వైసీపీ నేతలకు పని లేక ఆడవాళ్ళ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమాధానమిచ్చారు. నిజంగా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడిన వారు ఎవరైనా వాళ్ల పాపాన వాళ్ళే పోతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో తాము వ్యాఖ్యలు చేయకుండా చేశామని చెప్పిన వాళ్లు కూడా సంక నాకి పోతారు అని కొడాలి నాని చంద్రబాబు ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడవాళ్ళ ఉసురు తగిలి చంద్రబాబు నాశనం అవుతారని కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా మంత్రి కొడాలి నాని చురకలంటించారు. ధాన్యం కొనుగోళ్ళ రగడపై తెలంగాణా రాష్ట్రంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

చంద్రబాబు చెప్పేవి నిజమని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్న కొడాలి నాని, భార్యను అడ్డంపెట్టుకుని ఎవరైనా రాజకీయాలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు కుట్రలు పుట్టుకతోనే వచ్చాయని పేర్కొన్న కొడాలి నాని, చంద్రబాబు తాను చెప్పే మాటలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని సవాల్ విసిరారు. ఇదే సమయంలో గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీలో రోజా ను కంటతడి పెట్టించారు అని, లక్ష్మీపార్వతిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకువెళ్లారని దాని ఫలితంగానే, ప్రస్తుతం చంద్రబాబు ఎంతటి దౌర్భాగ్య కరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో చూస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పే మాటలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నా
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఔటర్ రింగ్ రోడ్ లను తానే కట్టించారని చంద్రబాబు చేసే ప్రకటనలను ప్రస్తావించిన కొడాలి నాని వైయస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తన హయాంలో జరిగిన అభివృద్ధి గా చెప్పుకుంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మాటలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే, అక్కడకు తాను వస్తానని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా?
ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మంత్రి కొడాలి నాని. పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం ఆపేస్తుందా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు కొడాలి నాని. ప్ల కార్డులు పట్టుకుంటే ప్రైవేటీకరణ ఆగిపోతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే తమ పార్టీ ఎంపీలు చొక్కాల పైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు రాయిస్తామన్నారు మంత్రి కొడాలి నాని. ఇక తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడని, కానీ పవన్ కళ్యాణ్ తానే ప్రశాంత్ కిషోర్ గా భావించి సలహాలిస్తున్నారా అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ కాదు .. సలహాలు మానుకోవాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ, అమిత్ షా, బీజేపీ రాష్ట్ర నేతల మనసు కష్టపడకుండా ఏం చేయాలో మిత్రపక్ష పార్టీగా పవన్ కళ్యాణ్ అదే చేసుకుంటే బాగుంటుందని మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో నిర్ణయం ఉంటుందా అంటూ ప్రశ్నించిన మంత్రి కొడాలి నాని, పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటే తమ పార్టీ బయటకు వెళ్లడం ఖాయం అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సలహాదారుడి పనులు మానుకోవాలని హితవు పలికారు మంత్రి కొడాలి నాని.

తెలంగాణా ధాన్యం కొనుగోళ్ళ రగడపై షాకింగ్ వ్యాఖ్యలు
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంపై మంత్రి కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే తమ రాష్ట్రంలో కూడా ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ రైతులకు ఏ పంటలు వేసుకోవాలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.5 మెట్రిక్ లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొన్న మంత్రి కొడాలి నాని ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు నుండి ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉందని కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన నారా భువనేశ్వరి
ఇదిలా ఉంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఇక ఈ సమయంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై తాను మాట్లాడను అంటూనే వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భువనేశ్వరి. ఆడపిల్లలంటే ఆటబొమ్మలు కాదంటూ పేర్కొన్న భువనేశ్వరి పని లేక మాపై విమర్శలు చేస్తున్నారని, సమాజానికి ఉపయోగం లేని విమర్శలు ఎందుకంటూ ప్రశ్నించారు. తన భర్త చంద్రబాబు రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారు, రాత్రింబవళ్లు ఏవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డారో తనకు తెలుసని పేర్కొన్న భువనేశ్వరి వైసీపీ నేతలు చేసిన విమర్శలు పట్టించుకోమని, బాధపడమని ప్రజాసేవకే అంకితం అవుతామని వెల్లడించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications