టీడీపీలోకి జూ ఎన్టీఆర్ రీ ఎంట్రీ అప్పుడే - కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వరుస సభలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ..పార్టీ నాయకత్వం చేపట్టటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

జూ ఎన్టీఆర్ వద్దకు వస్తారు
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ పైన కొడాలి నాని ఆసక్తకర చర్చకు కారణమయ్యారు. గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాని హాజరయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే.. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నేతలు.. పార్టీని కాపాడుకునేందుకు జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు. టీడీపీ మద్దతు సోషల్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ తిట్టిస్తున్నారని నాని ఆరోపించారు.

Kodali Nani crucial comments over Jr NTR Re Entry into the TDP Appeal for Tarak Fans

తారక్ ఫ్యాన్స్ కు పిలుపు
తనకు ఎన్టీఆర్ రాజకీయంగా జన్మనిచ్చారని ఎక్కడైనా ధైర్యంగా చెబుతానన్నారు.తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని.. నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. 10 మంది జూ.ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే.. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారని గుర్తు చేశారు నాని. కానీ చంద్రబాబు, లోకేష్‌ ఏనాడూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై దాడి చేయొద్దని టీడీపీ కార్యకర్తలకు చెప్పలేదన్నారు. జూ.ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పగ్గాలు అందిననాడే.. ఆయన అభిమానులు ఆ పార్టీకి మద్దతివ్వాలన్నారు. తనకు ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు కళ్లన్నారు నాని.

Kodali Nani crucial comments over Jr NTR Re Entry into the TDP Appeal for Tarak Fans

కొడాలి నానికి మద్దతు
తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతానన్నారు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వారికే కేటాయించారని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సందర్భంగా కొడాలి నానికి మద్దతు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+