అభిమానులకు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!
నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించారు. వెండితెరపై తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు రాబోయే సినిమా 'దాదా' కోసం స్వయంగా గొంతు విప్పారు. ఈ సినిమాలోని మొదటిపాట 'దాదా ధమాకా' కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, బాలకృష్ణ చేత కొన్ని మాస్ లైన్స్ పాడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఈ పాటను నవంబర్ 13న విడుదల చేయడానికి చిత్రబృందం సమాయత్తమవుతోంది.
తమన్-బాలయ్య మ్యాజిక్ రిపీట్
బాలకృష్ణ ఓ సినిమా కోసం పాట పాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'పైసా వసూల్' సినిమాలోని 'మామా ఏక్ పెగ్ లా' పాటను ఆయన స్వయంగా పాడగా.. ఆ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో బాలయ్య వాయిస్ పాటకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఎస్ఎస్ తమన్ ఆయనను మైక్ ముందుకు తీసుకురావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేయబోతోందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 24న థియేటర్లలోకి 'దాదా'
'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా 'దాదా'. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ సినిమాను డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 13న రాబోయే మొదటి సింగిల్‌తో ఈ సినిమా మ్యూజికల్ హంగామా షురూ కానుంది.














Click it and Unblock the Notifications
