గుంటూరుకు జగన్, కీలక నేతకు పరామర్శ..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ గుంటూరు పర్యటన ఖరారైంది. జైలులో ఉన్న పార్టీ నేత అప్పిరెడ్డిని పరామర్శించనున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రోజు గుంటూరు రూరల్ మండలంలో బ్యాలెట్ బాక్సు వివాదంలో అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. పార్టీ నేత లు ఇప్పటికే అప్పిరెడ్డిని పరామర్శించారు. కాగా.. అప్పిరెడ్డి అరెస్ట్ పైన ఘాటుగా స్పందించిన జగన్.. ఇప్పుడు జైలులో పరామర్శకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జైలుకు రానున్నారు. పార్టీ నేత అప్పిరెడ్డిని పరామర్శించాలి అని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే అప్పిరెడ్డి అరెస్ట్ పైన జగన్ స్పందించారు. తమ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ పైన కేసు నమోదు చేయటం పైన జగన్ కీలక ప్రశ్నలు సంధించారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దేశం మొత్తం చూస్తుందని... తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బ్యాలెట్ బాక్సులు రోడ్డు మీకు ఎలా వచ్చాయని నిలదీసారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమ ని జగన్ విమర్శించారు. అక్రమ అరెస్ట్.. నిర్బంధాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధించటం ఏంటని ప్రశ్నించారు.

అప్పిరెడ్డి అరెస్ట్ పై జగన్ ఆగ్రహం
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది?.. అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications
