• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గులేకుండా, పవన్: బాబుపై కొడాలి నాని, కిరణ్ రెడ్డి కూడా ఇలాగే, వైసీపీలో ఆ రూల్ లేదు

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం/విజయవాడ: కేంద్రం చేతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలుబొమ్మగా మారాడని, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తే మంచిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: అవిశ్వాసంతో దిగొచ్చిన కేంద్రం! రేపు కేబినెట్ భేటీ, ఏం లాభం.. పవన్‌కు బాబు దిమ్మతిరిగే షాక్

చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వంటి కేసుల్లో అడ్డంగా బుక్కయ్యారని విమర్శించారు. ఈ కేసులకు భయపడి కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్నారు.

చదవండి: బీజేపీపై టీడీపీ 'ప్రత్యేక' అస్త్రం: షాకివ్వబోయి పవన్ వ్యూహంలో జగన్ గిలగిల

అప్పటి నుంచి కేంద్రం చేతిలో కీలుబొమ్మ

అప్పటి నుంచి కేంద్రం చేతిలో కీలుబొమ్మ

కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని కొడాలి నాని మండిపడ్డారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తర్వాతనే కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాడన్నారు.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?

ఏం చెయ్యలేక తెరపైకి పవన్ కళ్యాణ్

ఏం చెయ్యలేక తెరపైకి పవన్ కళ్యాణ్

ప్రస్తుతం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తన పార్ట్‌నర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకు వచ్చారని కొడాలి నాని ధ్వజమెత్తారు. రకరకాల ప్రకటనలు చేయిస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారన్నారు.

చంద్రబాబుకు కావాల్సింది అదే

చంద్రబాబుకు కావాల్సింది అదే

చంద్రబాబుకు కావాల్సిందల్లా అధికారం మాత్రమేనని కొడాలి నాని మండిపడ్డారు. అందుకోసం ఆయన ఎంతకు అయినా దిగజారుతారని నిప్పులు చెరిగారు. వీళ్ల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీడీపీ, బీజేపీలకు పడుతుందని హెచ్చరించారు.

బీజేపీని విమర్శించవద్దనే నిబంధన లేదు

బీజేపీని విమర్శించవద్దనే నిబంధన లేదు

రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ కూడా ముద్దాయి అని మరో వైపీసీ నేత ధర్మాన ప్రసాద రావు అన్నారు. వైసీపీని బీజేపీ ఎందుకు విమర్శించడం లేదని టీడీపీ నేతలు అంటుండటంపై ఆయన స్పందించారు. బీజేపీని విమర్శించవద్దనే నిబంధన తమ పార్టీలో లేదన్నారు.

తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు

తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు

ప్రత్యేక హోదా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. హోదా ఇస్తేనే కలుస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. పొత్తు విషయంలో జగన్‌దే తుది నిర్ణయమని తెలిపారు. తాను సాధించానని చెబుతున్న చంద్రబాబు తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే టీడీపీ డ్రామాలు అన్నారు.

కిరణ్ రెడ్డి కూడా ఇలాగే చేశారు

కిరణ్ రెడ్డి కూడా ఇలాగే చేశారు

హోదా వద్దు ప్యాకేజీ చాలన్న సీఎం చంద్రబాబుకు నాలుగేళ్ల తర్వాత జ్ఞానోదయం అయిందని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వేరుగా అన్నారు. హోదా కావాలంటూ ఇప్పుడు చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారన్నారు. హోదా ఛాంపియన్ వైసీపీయేనని తెలుసుకొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆఖరి వరకు ఇలాగే వ్యవహరించారన్నారు.

సిగ్గులేకుండా, పవన్ ఒప్పించలేవా?

సిగ్గులేకుండా, పవన్ ఒప్పించలేవా?

రాజకీయ పార్టీలకే ఢిల్లీలో దిక్కు లేదని, ఇక చంద్రబాబు చెబుతున్న అఖిల సంఘాన్ని ఎవరు పట్టించుకుంటారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ మీతో ఉండమని తెగేసి చెప్పినా నాతోనే ఉండాలని సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. తన మిత్రపక్ష నాయకుడు చంద్రబాబును ఒప్పించలేని పవన్ కళ్యాణ్‌కు ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు సాధించడం సాధ్యమా అని ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ఎవరు ముందుకు వచ్చినా, రాకుననా పట్టించుకోమన్నారు. మార్చి 21న పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి తీరుతామన్నారు.

English summary
YSR Congress party MLA Kodali Nani and leader Dharmana Prasad rao fired at AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X