చంద్రబాబుకి ఏం పోయేకాలం.. పప్పు లోకేష్ అంటూ.. కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు!!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో పేలుతున్న మాటల తూటాలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని చంద్రబాబు పైన, లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దానికోసం చంద్రబాబు గాడిద కాళ్లయినా పట్టుకుంటాడు
చంద్రబాబుకు కావాల్సింది అధికారం అని, అందుకు గాడిద కాళ్లయినా పట్టుకుంటాడు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే పరిస్థితి లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. నందివాడ మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొడాలి నాని గతఎన్నికల్లో కంటే ఇప్పుడే తాము ఎక్కువ సీట్లు సాధిస్తామని, జగన్ పైన ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందని వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani harsh comments on chandrababu nara lokesh made interesting comments on land titling act

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల కోసమే ఇలా
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం జగన్ ఎంతో చేశారని కొడాలి నాని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో టిడిపి నేతలు మద్దతు ఇచ్చారని పేర్కొన్న కొడాలి నాని, అప్పుడు పయ్యావుల కేశవ్ మంచి చట్టమని కూడా చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ కొడాలి నాని విమర్శించారు.

చంద్రబాబును అంతా తిడుతున్నారు
రాష్ట్రంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకు డబ్బులు పడకుండా కూటమి నేతలు అడ్డుకున్నారని పేర్కొన్న కొడాలి నాని ప్రజలకు ఇవ్వాల్సిన నిధుల కోసం కోర్టుకెళ్లి పోరాడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి తీసుకువచ్చారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కి ఏం పోయేకాలం అని వృద్ధులు, మహిళలు బూతులు తిట్టుకుంటున్నారు అని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani harsh comments on chandrababu nara lokesh made interesting comments on land titling act

మంగళగిరిలో లోకేష్ గెలవడు
చంద్రబాబు మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదని, ఇప్పుడు చంద్రబాబును జనాలు ఎవరు నమ్మేది కూడా లేదని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. పప్పు లోకేష్ మంగళగిరిలో గెలవడు అని తేల్చి చెప్పారు.

చంద్రబాబును రాష్ట్రం నుండి సాగనంపే ఎన్నికలు
మతిభ్రమించి సీఎం జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలుతున్నారని కొడాలి నాని తిట్టిపోశారు. ఈ ఎన్నికలు చంద్రబాబుని రాష్ట్రం నుంచి సాగనంపే ఎన్నికలను పేర్కొన్న కొడాలి నాని, ప్రజలు చంద్రబాబుకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కామెంట్స్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+