డిక్లరేషన్ గురించి మాట్లాడితే... ఇంకా ఎక్కువ తిడతా... కొడాలీ నాని

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల వెంకటేశ్వర స్వామిపై చేసిన వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా రాజకీయా దుమారం రేపుతుండడంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను రాజకీయంగా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డాను తప్ప , శ్రీవారిపై ఎలాంటీ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన పేరు శ్రీ వెంకటేశ్వర రావు అని, మొదటి నుండి వెంకన్న భక్తుడినని అన్నారు. దీంతో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన విరుచుకుపడ్డారు.

తిరుమల చుట్టు తిరుగుతున్న ఏపీ రాజకీయం

తిరుమల చుట్టు తిరుగుతున్న ఏపీ రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడడంతో చెలరేగిన రాజకీయ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు తిరుమల వెంకటేశ్వర స్వామీ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని , టీడీపీ, బీజేపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయనపై కేసులు కూడ నమోదైన పరిస్థితి నెలకొనడంతో..... రాజకీయ విమర్శలు మొత్తం తిరుమల వెంకటేశ్వర స్వామి చుట్టు తిరుగుతున్నాయి.

స్పందించిన కొడాలి నానీ

స్పందించిన కొడాలి నానీ

తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ సంధర్భంగా మాట్లాడిన ఆయన... దురుద్దేశ్యంతోనే తనపై బురద జల్లుతున్నారని అన్నారు. దీంతో ఆయన ... మరోసారి రెచ్చిపోయారు. డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ తిట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తన పేరే శ్రీ వెంకటేశ్వర రావు అని, స్వతహగా తాను వెంకన్న భక్తుడినని, సుమారు నలబై సార్లు తిరుమలకు వెళ్లానని, ఇప్పటి వరకు 20 సార్లు గుండు గీయించుకున్నాని చెప్పారు. తాను ఈ నేపథ్యంలోనే తిట్టింది తిరుమల వెంకన్నను కాదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడునని స్పష్టం చేశారు.

అరుదైన గౌరవం సీఎం కుటుంబానికి వెంకన్న ఇచ్చారు

అరుదైన గౌరవం సీఎం కుటుంబానికి వెంకన్న ఇచ్చారు

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సైతం అనేక సార్లు తిరుమలకు వెళ్లారని చెప్పారు. వెంకన్న ఆలయానికి వెళ్లాలంటే టీడీపీ ,బీజేపీ పార్టీల అనుమతి తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించాడు. జగన్ పాదయాత్రకు ముందు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారని చెప్పారు. ఇక జగన్ మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామీని నమ్మాడు కాబట్టే...వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు సీఎం జగన్‌మోహన్ రెడ్డిలకు తిరుమల వెంకన్నకు పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశాన్ని కల్పించాడని అన్నారు..ఇలా రాష్ట్రంలో ఇతర కుటుంబాలకు వెంకటేశ్వర స్వామి అవకాశం కల్పించాడా అంటూ పశ్నించారు.

Recommended Video

    చంద్రబాబు ఇల్లు ఉంటే ఏంటి..! పోతే ఏంటి..!! || Kodali Nani Sansational Comments On Chandrababu
    కమ్మ కులంలో పుడితేనే వెంకన్న దర్శనానికి వెళ్లాలా

    కమ్మ కులంలో పుడితేనే వెంకన్న దర్శనానికి వెళ్లాలా

    ఇక తిరుమలను దర్శించుకోవాలంటే కమ్మ కులంలో పుట్టిన వారే అర్హులా అంటూ ధ్వజమెత్తారు. లేదంటే టీడీపీ, బీజేపీల అంగీకారం కావాలా అంటూ విరుచుకుపడ్డారు. ఇక ఈ రాష్ట్రానికి చెందిన పౌరుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఏ చర్చికైనా.. మసీదుతోపాటు గుడికి వెళ్లే హక్కు ఉందని వివరించారు. తాను చంద్రబాబు తండ్రి ఖర్జుర నాయుడు తిరుమలను నిర్మించాడా అని ప్రశ్నించాను తప్ప అపవిత్రను దెబ్బతీసే ఎలాంటీ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అసలు చంద్రబాబుకు డిక్లరేషన్‌పై అడిగే హక్కు ఎక్కడిదని మరోసారి ధ్వజమెత్తారు.

    ఎన్టీఆర్‌ను అధ్యక్షుడిగా నియమిస్తారా...?

    ఎన్టీఆర్‌ను అధ్యక్షుడిగా నియమిస్తారా...?

    మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం పార్టీని వీడడానికి ప్రధాన కారణం నానీ, వంశీలేనని టీడీపీ నేతలు విరుచుపడడంతో ఆయన స్పందించారు. తమ వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్న వారు ప్రస్తుతానికి తాము పార్టీ నుండి బయటకు వచ్చామని , ఇప్పుడైన జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారా అంటూ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+