భువనేశ్వరి యాత్రపై కొడాలి సెటైర్లు- న్యాయం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనోవేదన చెంది చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ్టి నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి ఆమె యాత్ర ప్రారంభమవుతోంది. దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో చంద్రబాబు అంటేనే మండిపడే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు.
చంద్రబాబు అరెస్టుతో జనం చనిపోయారంటే అమరావతి ఉద్యమంలో సహజ మరణాల్ని కలిపేసినట్లే ఉందని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొంత ఆలస్యమైనా నిజమే గెలుస్తుందన్నారు. వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఓ గాలి వానకు కొట్టుకుపోయినట్లు చంద్రబాబు పరిస్దితి ఉందన్నారు. రెండెకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు హెరిటేజ్ ను స్ధాపించి భువనేశ్వరికి అప్పగించారన్నారు.

ఎన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారని, కానీ చంద్రబాబు, భువనేశ్వరి స్ధాయిలో ఎవరైనా ఉన్నారా అని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తన పిల్లలకు ఆస్తులు సమానంగానే పంచారని, చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు ఇచ్చిన అర ఎకరం దున్ని వీరిద్దరూ రెండు లక్షల కోట్లు సంపాదించారా అని కొడాలి ప్రశ్నించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారన్నారు.
భువనేశ్వరి యాత్రపై కొడాలి సెటైర్లు..!!#NaraBhuvaneshwari #KodaliNani #Chandrababu #NijamGelavali #TDP #YSRCP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/joENv4KZNC
— oneindiatelugu (@oneindiatelugu) October 25, 2023
చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని కొడాలి నాని ఆరోపించారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని ఆయన ప్రశ్నించారు. అలాగే ముంబై నుంచి ఏడు కోట్ల బస్సు కూడా చంద్రబాబు తండ్రి ఇచ్చిన అర ఎకరంతోనే కొన్నారా అని అడిగారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని భువనేశ్వరిని కొడాలి ప్రశ్నించారు. భువనేశ్వరి కోరిక నెరవేరితే చంద్రబాబు చేసిన పాపాలు, అకృత్యాలకు ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటాడన్నారు.












Click it and Unblock the Notifications