అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారు-కారణం చెప్పిన కొడాలి నాని-ఫ్యూచర్ ప్లాన్ !
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ పోరులో కొడాలి నాని పాత్ర ఎంతో కీలకమైంది. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేస్తూ ఆయన నిత్యం చేసే విమర్శలకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ తనకు సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ పక్కనబెట్టేసిందన్న ఆవేదన కొడాలి మాటల్లో కనిపిస్తుంటుంది. ఇవాళ మరోసారి అదే ఆవేదనతో కొడాలి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

కొడాలి నాని కామెంట్స్
ఏపీలో టీడీపీ తీరుపై మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్ర సాగుతున్న తీరు, అందులో చేస్తున్న వ్యాఖ్యలపైనా కొడాలి మండిపడ్డారు. గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని... ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ఈక్వేషన్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి పాదయాత్రపై
అమరావతి పాదయాత్రపై మాట్లాడిన కొడాలి నాని.. టీడీపీ ఓ అస్తమించిన వ్యవస్థ అని అన్నారు. ఆ పార్టీ డిఫాల్డర్లు
అమరావతి పాదయాత్రలో పాల్గొంటూ.. నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా కలిగిన విశాఖ ఎక్కడ అంటూ కొడాలి ప్రశ్నించారు. విశాఖ నగరంపై రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషయం కక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగా ?
రాజధాని రాకతో విశాఖలో భూముల రేట్లు పెరిగి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోందన్న ఆరోపణల్ని కొడాలి ఖండించారు.
గతంలో రాజధాని రాకతో 30 లక్షలు ఉన్న అమరావతి భూములు రూ.10 కోట్లకు పెరిగాయన్నారు. రాజధాని నిర్ణయం తర్వాత గజాలు లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉన్నాయన్నారు. విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తి అయిన రిషికొండలో ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని అన్నారు.

లోకేష్ కు పగ్గాల కోసమే ఎన్టీఆర్ కు తిట్లు..
అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలపడం లేదని జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడంపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పాదయాత్రలో కొందరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. లోకేష్ కు పార్టీ అప్పచెప్పడానికి పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారన్నారని కొడాలి ఆక్షేపించారు. అందుకే పాదయాత్రపై టీడీపీ డిఫాల్టర్లు విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ టీడీపీలో కలిస్తే మా అన్న ఎన్టీఆర్ గారి అభిమానులు పార్టీకి దూరంగా వుంటారని అన్నారు.ఒక అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications