చంద్రబాబు ఆఫీస్ లో బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? టీడీపీ బంద్ పైనా కొడాలి నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నాయకుడు పట్టాభి వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టిడిపి నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడించారు ప్రయత్నం చేశారు. జగన్ పై వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఏపీ రణరంగంగా మారింది. టిడిపి పార్టీ ఆఫీస్ లపై దాడులపై స్పందించిన చంద్రబాబు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ రచ్చ
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులపై, కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు వివరించారు. కేంద్ర బలగాల సహాయం కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వైసిపి అరాచకాలకు నిరసనగా,తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్ కు కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు తిట్టిపోసుకుంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో రచ్చ చేస్తున్నారు. వైసీపీ టీడీపీ నేతల మధ్య సాగుతున్న వార్ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.

టీడీపీ ఆఫీస్ లో కూర్చునే జగన్ ను తిట్టారు .. అందుకే ఇలా : కొడాలి నాని
ఇదిలా ఉంటే టిడిపి ఆఫీసులపై దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, గన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ మంత్రులు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగిస్తుంటే , తాజాగా మంత్రి కొడాలి నాని టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ మీడియాతో మాట్లాడిన క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడిన కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని జగన్ ను తిట్టారని, అందుకే పార్టీ ఆఫీసు పగలగొట్టారు అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆఫీస్ లో నాలుగు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా ?
అంతేకాదు చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఆఫీసులో నాలుగు బల్లలు, రెండు కుర్చీలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించిన కొడాలి నాని, బల్లలు, కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టా? అంటూ నిలదీశారు. చంద్రబాబు బంద్ కు పిలుపునిస్తే రాష్ట్రంలో కనీసం ఒక చిన్నబడ్డీ కొట్టు కూడా మూయించలేడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.

చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు .. ఏపీలో టెన్షన్
తెలుగుదేశం పార్టీ నేతలు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఉంటే, వైసీపీ మంత్రులు చంద్రబాబును, పట్టాభి వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని బూతులు తిడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. టిడిపి ని బ్యాన్ చేయాలని ఈసీ ని కోరతామని బొత్స సంచలన వ్యాఖ్యలు చేస్తే, కేవలం పార్టీ ఆఫీసులో బల్లలు విరిగితేనే రాష్ట్రపతి పాలన పెట్టాలా అంటూ చంద్రబాబును కొడాలి నాని టార్గెట్ చేయడం గమనార్హం . ఇక తాజా పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!










Click it and Unblock the Notifications