పిల్లలను పవన్ రెచ్చగొట్టేలా - మంత్రి ఇంటి కంటే ప్రజలే ముఖ్యం : కొడాలి నాని..!!
నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చ గొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఆయన తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న పరిణామాల పైన స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు కోనసీమలో చోటు చేసుకున్న ఘటనలను పవన్ ఎందుకు ఖండించలేదంటూ నిలదీసారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టటానికి పవన్ అనుకూలమా - వ్యతిరేకమా తేల్చి చెప్పాలని డిమాండ్ చేసారు.

పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్
ఇక, ఆయన ఇతర జిల్లాల ఏర్పాటు సమయంలో అభ్యంతరాలకు 30 రోజుల సమయం ఇవ్వలేదని.. కోనసీమ జిల్లాకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించటాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల తప్పుబట్టారు. అప్పుడు 26 జిల్లాల ఏర్పాటు సమయంలోనూ 30 రోజుల సమయం ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూ..ఇప్పుడూ 30 రోజుల సమయం ఇచ్చారని..పవన్ అవగాహన లేకుండా ఆ వ్యాఖ్యలు చేసారని చెప్పుకొచ్చారు. ఇక, మాజీ మంత్రి కొడాలి మరింత ఘాటుగా పవన్ పైన కౌంటర్ ఎటాక్ చేసారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు.

వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇంతే
ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని సూచించారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్ళంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యమని... మంత్రి , ఎమ్మెల్యే ఇల్లులు కాదని స్పష్టం చేసారు.

మంత్రి ఇంటి కంటే ప్రజలే ముఖ్యం
అంబేద్కర్ ఒక్కరి వ్యక్తి కాదని భారతరత్న, అందరివాడని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు రక్షణపై కంటే గొడవలు ఆపి, ఎవరిని గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. మంత్రి విశ్వరూప్ ఇల్లు దహనం సైతం వైసీపీ నేతలే చేసుకున్నారంటూ పవన్ వ్యాఖ్యానించటం పైన వైసీపీ ముఖ్య నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పలువురు మంత్రులు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ - జనసేన కుట్రలో భాగంగానే కోనసీమ ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications