ఎన్టీఆర్ , మోడీ , పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని సీఎం అయిన చరిత్ర చంద్రబాబుది : కొడాలి నాని ధ్వజం టిడిపి అధ్య

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు జీవితమంతా మేనేజ్ చేయడమేనని విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి పారిపోయిన చరిత్ర చంద్రబాబుది అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు నాయుడు బతుకంతా అబద్ధాలు, మేనేజ్మెంట్ లు

చంద్రబాబు నాయుడు బతుకంతా అబద్ధాలు, మేనేజ్మెంట్ లు

ఎన్టీఆర్ ,మోడీ, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని సీఎం అయిన చరిత్ర చంద్రబాబుదని కొడాలి నాని ఘాటుగా విమర్శించారు. ఎన్నికలు ఏవైనా సరే గెలుపు ఖాయం అని చెప్పుకునే చంద్రబాబు, పరిషత్ ఎన్నికల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు . గెలుస్తామని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఇక ఎన్నికల తర్వాత పది రోజులపాటు కనిపించకుండా పోతాడు అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు బతుకంతా అబద్ధాలు , మేనేజ్మెంట్ లు , కుట్రలు, వెన్నుపోట్లు అని కొడాలి నాని విమర్శించారు .

లోకేష్ చవట, సన్నాసి, చంద్రబాబుకు అల్జీమర్స్

లోకేష్ చవట, సన్నాసి, చంద్రబాబుకు అల్జీమర్స్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు, ఆయన పిచ్చి కొడుకు లోకేష్ చేసే విమర్శలు అర్ధరహితం అని విమర్శించారు. లోకేష్ ను చవట, సన్నాసి అంటూ తిట్టిపోశారు. చంద్రబాబును రాజకీయంగా సమాధి చేసిన జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో అడ్డమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

చంద్రబాబు నంబర్ 1 వెన్నుపోటుదారుడు అని ఎన్టీఆర్ సర్టిఫై చేశారు

చంద్రబాబు నంబర్ 1 వెన్నుపోటుదారుడు అని ఎన్టీఆర్ సర్టిఫై చేశారు

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తి విద్యావంతుడు అని, వైద్యుడని అతడిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు కొడాలి నాని . చంద్రబాబు నాయుడు నంబర్ 1 వెన్నుపోటు దారుడు అని గతంలో ఎన్టీఆర్ సర్టిఫై చేశారన్నారు.

ప్రత్యేక హోదా అడిగితే కేసులు పెడతారు అని భయపడే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి కాదని స్పష్టం చేసిన కొడాలి నాని అధికారంలో ఉన్న సమయంలోనే సోనియాగాంధీని ఎదిరించి నిలబడ్డారని, ఆయనపై ప్రస్తుతం ఉన్న కేసులను దొంగ కేసులని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రప్రజలందరి కంటే చంద్రబాబు గురించి చిత్తూరు ప్రజలకే ఎక్కువ తెలుసు

రాష్ట్రప్రజలందరి కంటే చంద్రబాబు గురించి చిత్తూరు ప్రజలకే ఎక్కువ తెలుసు

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసింది ప్రజలు ఇంకా మర్చిపోలేదని, చంద్రబాబు గురించి రాష్ట్ర ప్రజలందరికన్నా చిత్తూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్న కొడాలి నాని, ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు అని మండిపడ్డారు.


తిరుపతి ఉప ఎన్నికల ప్రచార బాధ్యత భుజాన వేసుకుని కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+