kodali nani ysrcp pawan kalyan chandrababu chandrababu naidu nara lokesh tdp janasena party ys jagan ys jagan mohan reddy krishna district election campaign boycott mptc AP Local Body Elections 2021 కొడాలి నాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం బహిష్కరణ ఎంపీటీసీ politics
లోకేష్ పప్పుగాడు, పెద్ద వెధవ, పేమెంట్ కోసమే పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు: కొడాలి నాని వదలడుగా!!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై , అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు , లోకేష్ లు చవట దద్దమ్మలని, పవన్ కళ్యాణ్ కు పరిపక్వత లేదని కొడాలి నాని నిప్పులు చెరిగారు.

ఓడిపోతామని తెలిసే చంద్రబాబు కుంటి, గుడ్డి సాకులు
రాష్ట్రంలో తాము ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, తెలుగుదేశం పార్టీ గెలిచే స్థితి లేదని, చంద్రబాబు ఓడిపోతామని తెలిసే ఎన్నికల బహిష్కరణ పేరుతో మరో నాటకానికి తెరలేపారని కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు కుంటి, గుడ్డి సాకులు వెతుక్కుంటూ ఎన్నికలను బహిష్కరించారని విమర్శించిన కొడాలి నాని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనతో ప్రజలు మళ్లీ వైసీపీ కే పట్టం కడతారని పేర్కొన్నారు.

చంద్రబాబు అమాయకుడు , చిన్న పిల్లాడు కాదు .. ఎన్నికల బాయ్ కాట్ అందుకే
2019 ఎన్నికల్లో అర్బన్ లో తెలుగుదేశం పార్టీకి 44 శాతం ఓటింగ్ శాతం వచ్చిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 46% వచ్చిందని పేర్కొన్న కొడాలి నాని, గతంలో రూరల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 53% పోలింగ్ శాతం వచ్చిందని , తెలుగుదేశం పార్టీకి 37 శాతం ఓటింగ్ శాతం వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 20% పడిపోతుందని భావించే ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారని, చంద్రబాబు చిన్న పిల్లోడు కాదు, అమాయకుడు అంతకంటే కాదు అంటూ విమర్శించారు .

లోకేష్ పెద్ద వెధవ .. పప్పుగాడు
ఇదే సమయంలో లోకేష్ తాజాగా తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో లోకేష్ చేసిన వ్యాఖ్యల పై నిప్పులు చెరిగారు. లోకేష్ అనే వాడు పెద్ద వెధవ అంటూ మండిపడ్డారు. లోకేష్ లాంటి పప్పు గాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని , వాళ్లకు అధికారం డబ్బుల కోసమే కావాలని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే హెరిటేజ్ షేర్ల ధర పెరుగుతుందని, అక్రమంగా సంపాదించిన డబ్బును పాలు అమ్మినట్టు, పెరుగు అమ్మినట్టు, పేడ అమ్మినట్టు చూపిస్తారని విమర్శించారు.

పోటీలో లేమని చెప్తూనే ఇంటర్నల్ గా అభ్యర్థులను ప్రచారం చెయ్యమంటున్నారు
లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు అన్నారు . తండ్రీకొడుకులు డబ్బు కోసం జూద గృహాలు నడిపారని , డబ్బు కోసం దేనికైనా దిగజారే రకాలని మండిపడ్డారు . ఈ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయో రావో కూడా తెలియదన్నారు. మళ్లీ ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు అని ఆరోపించారు. ఒకపక్క పోటీలో లేమని చెబుతూనే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు.

పవన్ కు ఇంకా బుద్ధి రాలేదు .. ఓటుహక్కు లేని పిల్లలతో సీఎం అని పిలిపించుకుంటాడు
పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని పేర్కొన్న మంత్రి కొడాలి నాని రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదు అని ఫైర్ అయ్యారు. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. జనసైనికులు , జన సైకిల్ గా మారారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి డప్పు కొడతారని , సొల్లు కబుర్లు చెబుతారని పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.