పవన్ కాళ్లు పట్టాడు, లోకేష్‌కూ వెన్నుపోటు, ఆ దద్దమ్మలు మాకొద్దు: బాబుపై నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీల కాళ్లు పట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైసిపి నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం మండిపడ్డారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీల కాళ్లు పట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైసిపి నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం మండిపడ్డారు.
చదవండి: మా ఫ్యామిలీలో చిచ్చుకు ప్రయత్నం.. అఖిలప్రియ సంచలనం
చంద్రబాబు అధికారం కోసం పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. అవసరమైతే కన్న కొడుకు లోకేష్‌కు కూడా ఆయన వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. చంద్రబాబు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు, లేదంటే జుట్టు పట్టుకుంటారన్నారు.

ఆ దద్దమ్మలు మా పార్టీకి అవసరం లేదు
తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయిన వారిపై కూడా కొడాలి నాని మండిపడ్డారు. అధికార పార్టీని ఎదుర్కోలేకనే వారంతా జంప్ అయ్యారని, అలాంటి దద్దమ్మలు వైసిపిలో లేకపోయినా ఫర్వాలేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు మోడీ కాళ్లు పట్టుకునే చంద్రబాబు గెలిచారన్నారు.

చంద్రబాబు, లోకేష్ అవినీతిలో కూరుకుపోయారు
రాష్ట్రంలో అరాచకం నెలకొందని, శాంతిభద్రతలు క్షీణించాయని వైసిపి నేతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈడ్పుగల్లులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా ప్లీనరీకి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయన చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ అవినీతిలో కూరుకుపోయారన్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ప్రతి విషయంలోనూ టిడిపి దోపిడీ కొనసాగుతోందన్నారు.

ఒక్క వర్షానికే అసెంబ్లీలో కురిసింది
అమరావతి రాజధాని పేరుతో భూదందా జరుగుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలు ఒక్క వర్షానికే కురవడాన్ని ప్రజలు గమనించారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పోలవరం కాలువలు నిర్మిస్తే వాటిని నేటి పాలకులు వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఒక్క పురుషోత్తపట్నంలోనే వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. తిరిగి వైయస్ పాలన కావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.

ప్రతి దానికి జగన్‌నే
మరో నేత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం డబ్బు ఇవ్వడం లేదని చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ప్రతిదానికి జగన్‌ను విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ.. వైయస్ హయాంలో ప్రతి ఏటా జూన్‌లో డెల్టాకు సాగునీరు ఇచ్చిన విషయాన్ని మంత్రి దేవినేని గుర్తుంచుకోవాలన్నారు. ఇసుక, మట్టితో అవినీతికి పాల్పడిన టిడిపి నేతలు తరతరాలకు సరిపడేంత సంపాదించుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు ఆదిమూల సురేష్, కొడాలి నాని, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ప్లీనరీలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications