కొడాలి నాని, వంశీపై జగన్ సీరియస్ ? తాజా అల్టిమేటం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో హవా చెలాయించిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. అంతే కాదు వారికి పార్టీలో కొనసాగుతారో లేదో చూసుకోవాలని కూడా అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన వీరిద్దరిపై జగన్ ఎందుకు సీరియస్ అయ్యారో ఓసారి చూద్దాం..
ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నానికి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే చుక్కలు కనిపిస్తున్నాయి. వంశీని ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసి వేధించిన కూటమి సర్కార్ ఆయన అనారోగ్యం పాలవ్వడంతో వదిలేసినట్లు కనిపిస్తోంది. అలాగే కొడాలి నాని కూడా గుండె ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వంశీ కూడా అక్కడే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరంలో వైసీపీ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ లో టీడీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండగా.. అదే నియోజకవర్గాలకు చెందిన కొడాలి, వంశీ ఇద్దరు మాత్రం హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. దీనిపైనే జగన్ వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర స్ధాయిలో ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా గుడివాడ, గన్నవరంలో మాత్రం వాటిని నిర్వహించే వారు కరువయ్యారు. దీంతో పార్టీలో ఉంటారా లేక వేరే వారిని చూసుకోమంటారా అని జగన్ డెడ్ లైన్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా జగన్ వీరిద్దరితో పాటు మొత్తం 20 మంది నేతల్ని తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. ఇందులో కొడాలి, వంశీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేశ్, వరికూటి అశోక్ కుమార్, కొఠారు అబ్బయ్య చౌదరి వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కూటమి సర్కార్ పెడుతున్న కేసుల భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉండటమూ లేక అక్కడే ఉండి సైలెంట్ గా ఉండటమూ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు యాక్టివ్ కాకపోతే కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications