ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటీ చేతకాదని కోదండరాం: నేనున్నానని జగన్ భరోసా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodanda rejects to contest
అదిలాబాద్/ఏలూరు: తనకు పోటీ చేతకాదని, ప్రభుత్వంతో పని చేయించడమే తెలుసునని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. మంచిర్యాలలో కోదండరామ్ పర్యటిస్తున్న సమయంలో పలువురు.. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయవల్సిందిగా కోరారు. దీనిపై ఆయనస్పందించారు. తెలంగాణ సాధించుకున్న ప్రజాబలంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను ముఖ్యమంత్రి కాగానే ప్రజల తలరాతలను మార్చే నాలుగు కీలక పథకాల పైన సంతకాలు చేస్తానని చెప్పారు.

అమ్మ ఒడి పథకం పైన తాను తొలి సంతకం చేస్తానని చెప్పారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. వైయస్సార్ అమ్మఒడి పథకం, పింఛను రూ.700, వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసేలా... నాలుగు సంతకాలు చేస్తానని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం లేని వ్యక్తి అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఏ గడ్డి అయినా తినే పరిస్థితులను ఈ రోజు చూస్తున్నామన్నారు. ఓట్లు, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదన్నారు. రాజకీయ వ్యవస్థను మార్చాల్సి ఉందన్నారు. రెండు నెలల్లో కాంగ్రెసు పార్టీకి చరమగీతం పాడుదామన్నారు.

English summary
Telangana Political Joint Action Committee chairman Kodandaram has rejected to contest in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X