జగన్‌కు స్పీకర్ కోడెల షాక్: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊరట

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన శానససభ్యుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. తమ పార్టీని వీడి టిడిపిలో చేరిన 13 మంది శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు పిటిషన్ దాఖలు చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కూడా కోడెల శివప్రసాద్ తోసిపుచ్చారు. దీంతో టిడిపిలో చేరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులకు ఊరట లభించింది. తొలి విడత 11 మంది శానససభ్యులపై, రెండో విడత ఇద్దరు శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

Kodela dismisses YCP's petitions on defected MLAs

సాంకేతిక లోపాలున్నాయనే కారణంతో స్పీకర్ ఆ పిటిషన్లను తిరస్కరించారు. పిటిషన్లు నిబంధనల మేరకు లేవని స్పీకర్ తెలిపారు. విచారణ జరిపిన తర్వాతనే ఆ పిటిషన్లను తోసిపుచ్చినట్లు కోడెల శివప్రసాద రావు చెప్పారు. పిటిషన్లు రాజ్యాంగబ్దదంగా లేవని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, జలీల్ పాషా, ఆదినారాయణ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, డేవిడ్ రాజు, సుజయ కృష్ణ రంగారావు, తదితరులున్నారు. వైసిపి దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చినట్లు కోడెల అధికారికంగా ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh speaker Kodela Prasad Rao dismissed the petitions filed by YS Jagan's YSR Congress party seeking the disqualification of defected MLAs to Telugu Desam Party (TDP).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి