ఛీకొడితే వచ్చావు, నీకేం సంబంధం: అంబటి రాంబాబుకు కోడెల కొడుకు హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబుపై టిడిపి నేత కోడెల శివరాం సోమవారం విరుచుకుపడ్డారు. శివరాం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల శివరాం స్పందించారు.

Big News Big Bite : Today Trending News

సత్తెనపల్లి అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ నేత అంబటిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంబటి పుట్టిన ఊరు, నమ్మిన గ్రామస్తులను మోసం చేసి ఇక్కడకు వచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అంబటి సవాల్, బుద్ధా వెంకన్న ప్రతి సవాల్: సత్తెనపల్లిలో ఉద్రిక్తత, రాంబాబు హౌస్ అరెస్ట్

సొంత గ్రామస్తులు ఛీకొడితే

సొంత గ్రామస్తులు ఛీకొడితే

సొంత గ్రామ ప్రజలు చీకొడితే అంబటి రాంబాబు ఇక్కడకు వచ్చారని కోడెల శివరాం ఆరోపించారు. ఇక్కడకు వచ్చి బతుకుతున్న అంబటికి సత్తెనపల్లితో గానీ, పల్నాడుతో గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సత్తెనపల్లిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సవాల్, ప్రతిసవాల్

సవాల్, ప్రతిసవాల్

కాగా, అంబటి రాంబాబు, బుద్దా వెంకన్నల సవాల్, ప్రతి సవాల్ నేపథ్యంలో సత్తెనపల్లిలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంబటిని పోలీసులు హౌస్ అరెస్టు కూడా చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట నిరసనలు చేపట్టేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు తిప్పి పంపించారు.

టీడీపీ ర్యాలీ

టీడీపీ ర్యాలీ

మరోవైపు, టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కోడెల శివరాం, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తదితరులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీ సందర్భంగా శివరాం.. అంబటి రాంబాబుపై నిప్పులు చెరిగారు. మరోవైపు పోలీసుల తీరును అంబటి ఖండించారు.

పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ

పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ

అభివృద్ధి, పింఛన్లపై చర్చ చేపడితే అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే పోలీసులు తమను అడ్డుకున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కుట్రలు చేశారన్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Kodela Sivaram fired at YSR Congress Party leader Ambati Rambabu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి